BREAKING
'ఆదర్శ కుటుంబం.. AK47' రిలీజ్ వాయిదా.. వెంకటేష్-త్రివిక్రమ్ సినిమా కొత్త విడుదల తేదీ ఇదే! అమెరికా మార్కెట్ లోకి షిరిడి సాయి ట్రాన్స్ఫారంలు ఎగుమతి ప్రైమ్ వీడియో 'ది లవ్ హైపోథెసిస్' రివ్యూ.. నకిలీ ప్రేమలో అసలైన మ్యాజిక్ వర్కవుట్ అయిందా? కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ రంగానికి తీరని నష్టం 24న ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కడప కార్పొరేషన్ లోని 66 డివిజన్లో ఓటర్ జాబితా విడుదల మహిళా అభివృద్ధికి మోదీ ప్రభుత్వం పెద్దపీట జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా తలమల్ల మల్లేశం యూనస్ హయాంలో కుదిరిన అమెరికా వాణిజ్య ఒప్పందంపై బంగ్లాదేశ్ మీడియా అసంతృప్తి 'మీసయ మురుక్కు 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. హిప్‌హాప్ ఆది సినిమా ఎలా ఉందంటే? గణేష్ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన ఎస్సై ఆవుల తిరుపతి ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లలో నికెల్ గనుల కొనుగోలుకు భారత్‌కు చెందిన 'లోహమ్' కసరత్తు యూపీఐ ప్లాట్‌ఫారమ్‌లకు ఫీజుల మోత లిథువేనియాకు అమెరికా బలగాల నూతన నియామకం 4వ సారి జాతీయ ఉత్తమ నటుడిగా మమ్ముట్టి.. కార్తీక్ ఆర్యన్‌కూ ప్రతిష్టాత్మక అవార్డు!

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి

Select Suryaa Now
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష  వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష

వినాయక మండపంలో పూజ..
రాజోలి వీరారెడ్డి


కడప మేజర్ న్యూస్

కడప నగరంలోని ఎన్జీవో కాలనీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో సోమవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు రాజోలి వీరారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆయన వినాయకుడిని దర్శించుకుని స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజోలి వీరారెడ్డి మాట్లాడుతూ విఘ్నేశ్వరుని అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఆది దేవుడైన శ్రీ వినాయకుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబంపై ఉండాలని, ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరుకున్నారు. వినాయక చవితి పర్వదినం భక్తిభావానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుడిని పూజించి, స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో, భక్తిభావంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మండప నిర్వాహకులు రాజోలి వీరారెడ్డిని సత్కరించి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు..