BREAKING
నేషనల్ అవార్డ్‌ అందుకున్న సుకుమార్, నిహారిక వాడపల్లి క్షేత్రం.. భక్తజన శోభితం శ్రీశైలంలో శ్రీ కుమారస్వామికి ప్రత్యేక పూజలు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌కు రోటరీ ఐ హాస్పిటల్‌లో శిబిరం  యూనస్ హయాంలో కుదిరిన అమెరికా వాణిజ్య ఒప్పందంపై బంగ్లాదేశ్ మీడియా అసంతృప్తి: సమీక్షించాలని తాత్కాలిక ప్రభుత్వానికి విజ్ఞప్తి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి శ్రీ మఠంలో సుదర్శన హోమం ప్రతిభావంతులైన విద్యార్థినులకు నగదు పురస్కారాలు చదువులో రాణించాలి - కోటిరెడ్డి ట్రస్ట్ వారసులు.. 104 వైద్య సేవలో నిర్లక్ష్యం -ఎగువ పల్లె ప్రజలు ఆవేదన  సరికొత్త ఉడాన్ పథకానికి21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రీన్ సిగ్నల్:  విస్తరించనున్న ప్రాంతీయ విమానయాన సేవలు డ్రైనేజీ ఆక్రమణల తొలగింపునకు మున్సిపల్ చర్యలు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి. డివిజన్‌లో ఈ నెల 27న టీయూడబ్ల్యూజేఎఫ్ సమావేశం. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి వల్లూరు.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా.. పంట నమోదు చేసుకున్న ప్రతి రైతు తప్పనిసరిగా ఈకేవైసి చేయించుకోవాలి. మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి గుజరాత్‌లో జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులకు లైన్ క్లియర్: ఎన్‌హెచ్ఏఐ, ఎస్‌ఎస్ఎన్‌ఎన్ఎల్ మధ్య కీలక ఒప్పందం

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాల కిష్టారెడ్డి.

Select Suryaa Now
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాల కిష్టారెడ్డి.

ఉన్నత విద్యతో ఉపాధి అవకాశాలు.

 

కోదాడ )మేజర్ న్యూస్)కె.ఆర్. ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్. విభాగం శక్తి యూత్ ఆధ్వర్యంలో "ఉన్నత విద్య-ఉద్యోగ అవకాశాలు"అనే అంశంపై మంగళవారం సెమినార్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాన వక్తగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్  ప్రొఫెసర్ వి.బాల కిష్టారెడ్డి పాల్గొని ఇంటర్, డిగ్రీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.   డిగ్రీ దండగ కాదు పండగ అని, ఈరోజున ప్రపంచానికి భారతదేశం మానవ వనరులను ఉన్నతంగా అందిస్తుందని అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా సాంకేతిక రంగం, పారిశ్రామిక రంగంలో కూడా ఊహించని కొలువులు లభిస్తాయని అన్నారు. వివిధ డిగ్రీ కోర్సులు, పీజీ కోర్సులు, పీ.హెచ్డీ లు చేసిన వారికి, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్, ఏరోస్ స్పేస్ మొదలైన రంగాలలో రాణించిన వారికి కూడా ఆకర్షణీయమైన, ఉద్యోగాలు, వేతనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ పెంచుకోవాలని, వృత్తి విద్యా కోర్సులు శ్రద్ధతో చదివితే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన అన్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ప్రతి విద్యార్థి సమయాన్ని వృధా చేయకుండా ప్రభుత్వం తీసుకు వస్తున్నటువంటి అనేక విద్యా సంస్కరణలను నిషితంగా పరిశీలిస్తూ ముందుకెళ్లాలని ఆయన అన్నారు. పఠనం ద్వారా జ్ఞానం, ఉపాధి వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో నూతనంగా చేపడుతున్న సంస్కరణలు సిలబస్లో జరిగిన మార్పులను వివరించారు. తదనంతరం డిగ్రీ విద్యార్థులకు ఉన్న సిలబస్ అనుమానాలను నివృత్తి చేశారు. సూర్యాపేట జిల్లా ఇంటర్ విద్యాధికారిణి  బి.సులోచన రాణి మాట్లాడుతూ ఇలాంటి చైతన్య సదస్సులు ఇంటర్ స్థాయిలో జరగడం సంతోషమని ప్రత్యేకంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ స్వయంగా విద్యార్థులతో మాట్లాడడం ఉత్సాహాన్నిచ్చిందని ఆమె అన్నారు. కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ తలారి శ్రీనివాసరావు మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిని ఉన్న ఊరును మర్చిపోకుండా మట్టి రుణం తీర్చుకోవాలని పెద్ద చదువులు చదివి సొంత ఊరుకు సేవ చేయాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ నారు రమణారెడ్డి అధ్యక్షతన సమావేశంలో ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు, రణబోతు పిచ్చి రెడ్డి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్.ఎస్.ఎస్. శిక్షకులు డా రవితేజ, హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి, జి.యాదగిరి, ఆర్.రమేష్, పి. రాజేష్,ఎం. రత్నకుమారి,బి. రమేష్ బాబు,జి. వెంకన్న,కె. రామరాజు,జి.రవి కిరణ్,కె.సతీష్,జి. నాగరాజు,ఈ. నరసింహారెడ్డి,ఎస్. కె.ముస్తఫా,జె. తిరుపతయ్య, ఎస్.కె.ఆరిఫ్ అలీ, కలకొండ శాంతయ్య, ఎన్. జ్యోతిలక్ష్మి, ఆర్.చంద్రశేఖర్, ఎస్.వెంకటేశ్వర చారి,టి.మమత, డి.ఎస్.రావు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.