BREAKING
పులివెందులపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాటలు కాదు పనులు చేసి చూపించాలి 'ఆదర్శ కుటుంబం.. AK47' రిలీజ్ వాయిదా.. వెంకటేష్-త్రివిక్రమ్ సినిమా కొత్త విడుదల తేదీ ఇదే! అమెరికా మార్కెట్ లోకి షిరిడి సాయి ట్రాన్స్ఫారంలు ఎగుమతి ప్రైమ్ వీడియో 'ది లవ్ హైపోథెసిస్' రివ్యూ.. నకిలీ ప్రేమలో అసలైన మ్యాజిక్ వర్కవుట్ అయిందా? కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ రంగానికి తీరని నష్టం 24న ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కడప కార్పొరేషన్ లోని 66 డివిజన్లో ఓటర్ జాబితా విడుదల మహిళా అభివృద్ధికి మోదీ ప్రభుత్వం పెద్దపీట జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా తలమల్ల మల్లేశం యూనస్ హయాంలో కుదిరిన అమెరికా వాణిజ్య ఒప్పందంపై బంగ్లాదేశ్ మీడియా అసంతృప్తి 'మీసయ మురుక్కు 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. హిప్‌హాప్ ఆది సినిమా ఎలా ఉందంటే? గణేష్ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన ఎస్సై ఆవుల తిరుపతి ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లలో నికెల్ గనుల కొనుగోలుకు భారత్‌కు చెందిన 'లోహమ్' కసరత్తు యూపీఐ ప్లాట్‌ఫారమ్‌లకు ఫీజుల మోత లిథువేనియాకు అమెరికా బలగాల నూతన నియామకం

పంట నమోదు చేసుకున్న ప్రతి రైతు తప్పనిసరిగా ఈకేవైసి చేయించుకోవాలి. మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి

Select Suryaa Now
పంట నమోదు చేసుకున్న ప్రతి రైతు తప్పనిసరిగా ఈకేవైసి చేయించుకోవాలి.  మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి

ముద్దనూరు మేజర్ న్యూస్: 

మండలంలోని వేల్పుచర్ల గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మగళవారం  మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించి రభి పంటల సాగుకు సమాయత్తం కావాలి అని కోరారు. రైతులకు కావలసిన డిఎపి, యూరియా ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఖరీఫ్ లో సాగు చేసిన పంట నమోదు అనంతరం రైతులు ఈ కేవైసి పక్రియ పూర్తి చేసుకోవాలి అని తెలిపారు. పకృతి వ్యవసాయ సిబ్బంది ద్రవ జీవామృతం తయారు చేసే విధానాన్ని డెమో రూపంలో చూపించారు. రైతులు విత్తనం వేసేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ది చేసుకోవాలి అని కోరారు. రైతులు పకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి అన్నారు. తదుపరి గ్రామంలో సాగు చేసిన ఉల్లి పంటను పరిశీలించి తగు సూచనలు సలహాలు అందించారు.పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి అన్నారు. ఎరువుల యాజమాన్యం పద్ధతులను అనుసరించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకుడు రెడ్డి భాష, పకృతి వ్యవసాయ సిబ్బంది రామ సుధ, శైలజ, నాగ పావని,నాగ లక్ష్మీ దేవి,రామాంజనేయులు తదితర రైతులు పాల్గొన్నారు.