BREAKING
స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో విజయనగరం జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం ఎస్.భూర్జవలస హెచ్ఎం కెవి సత్తిబాబుకు స్వచ్ఛత అవార్డు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు

విద్యుత్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో రైతుల ప్రాణాలకు ముప్పు:

Select Suryaa Now
విద్యుత్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో రైతుల ప్రాణాలకు ముప్పు:

విద్యుత్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో రైతుల ప్రాణాలకు ముప్పు:
- కరెంట్‌ లైన్‌ ఆన్‌ చేయడంతో నలుగురు రైతులకు గాయాలు
- ఎల్‌సీ తీసుకున్నా విద్యుత్‌ సరఫరా.. 
- తృటిలో తప్పిన పెను ప్రమాదం
 

 కొల్చారం …వరిగుంతం సబ్‌స్టేషన్‌ వద్ద రైతుల ఆందోళన.బాధ్యులపై చర్యలకు డిమాండ్‌
కొల్చారం: విద్యుత్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో నలుగురు రైతులు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్న ఘటన కొల్చారం మండలం వరిగుంతం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మరమ్మతుల కోసం విద్యుత్‌ సరఫరా నిలిపివేసి ఎల్‌సీ (లైన్‌ క్లియర్‌) తీసుకున్నప్పటికీ.. స్తంభంపై రైతులు ఉండగానే విద్యుత్‌ లైన్‌ ఆన్‌ కావడం తీవ్ర కలకలం రేపింది.
స్తంభంపై రైతులు.. ఒక్కసారిగా కరెంట్‌!
సీతారాం తండాలోని సేవాలాల్‌ గుడి వద్ద వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ సుమారు 15 రోజుల క్రితం చెడిపోయింది. మరమ్మతుల కోసం లైన్‌మెన్‌ బాల్య వరిగుంతం సబ్‌స్టేషన్‌లోని ఆపరేటర్‌ శ్రీశైలంకు సమాచారం అందించారు. ఎల్‌సీ తీసుకున్న అనంతరం మరమ్మతు పనులు ప్రారంభించారు.
లైన్‌మెన్‌తో పాటు నలుగురు రైతులు విద్యుత్‌ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా విద్యుత్‌ సరఫరా రావడంతో ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. ఓ రైతుకు స్వల్పంగా విద్యుత్‌ షాక్‌ తగలడంతో గట్టిగా అరుస్తూ స్తంభం నుంచి కిందకు దూకాడు. అప్రమత్తమైన మరో ముగ్గురు రైతులు కూడా కిందకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది.
నలుగురికి స్వల్ప గాయాలు
స్తంభం నుంచి కిందకు దూకడంతో రమావత్‌ రాజు, బాల్‌సింగ్‌, రెడ్యా, నందులకు స్వల్ప గాయాలయ్యాయి. తోటి రైతులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.సబ్‌స్టేషన్‌ వద్ద రైతుల ఆందోళన
ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీతారాం తండా రైతులు గురువారం వరిగుంతం సబ్‌స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా రైతులు విద్యుత్‌ అధికారులతో వాగ్వాదానికి దిగారు.