వెట్టిచాకిరీ నిర్మూలనకు ‘స్వేచ్ఛా రథం’
-బాధితుల హక్కులపై విస్తృత అవగాహన కల్పించాలి : అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి
వెట్టిచాకిరీ నిర్మూలనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రస్థాయి ‘స్వేచ్ఛా రథం’ ప్రచార కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి గురువారం జెండా ఊపి ప్రారంభించారు. వెట్టిచాకిరీ బాధితులు, అసంఘటిత రంగ కార్మికులకు వారి హక్కులు, ప్రభుత్వ సహాయ మార్గాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రా రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో వెట్టిచాకిరీని పూర్తిగా నిర్మూలించేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వెట్టిచాకిరీకి సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి బాధితులను గుర్తించడం, వారికి విముక్తి కల్పించడం, అవసరమైన సహాయం, పునరావాసం అందించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. వ్యవసాయం, ఇటుక బట్టీలు, ఆక్వాకల్చర్, గనులు, క్వారీల వంటి అసంఘటిత రంగాల్లో కార్మికులు శ్రమదోపిడీకి గురయ్యే అవకాశాలు ఉన్నందున ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
రంగారెడ్డి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 08):