BREAKING
స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో విజయనగరం జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం ఎస్.భూర్జవలస హెచ్ఎం కెవి సత్తిబాబుకు స్వచ్ఛత అవార్డు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు

వేద సంస్కృతి పరిరక్షణలో బ్రాహ్మణుల పాత్ర కీలకం – చతుర్వేద సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే

Select Suryaa Now
వేద సంస్కృతి పరిరక్షణలో బ్రాహ్మణుల పాత్ర కీలకం – చతుర్వేద సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే

వేద సంస్కృతి పరిరక్షణలో బ్రాహ్మణుల పాత్ర కీలకం
– చతుర్వేద సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే 
– పటాన్‌చెరు నియోజకవర్గంలో బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

పటాన్‌చెరు, ; భారతీయ సంస్కృతి,సనాతన ధర్మం,వేద సంప్రదాయాలను తరతరాలకు అందించడంలో బ్రాహ్మణ సమాజం విశిష్టమైన పాత్ర పోషిస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్ధక సభ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ భవనంలో నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు–10వ చతుర్వేద సదస్సులో భాగంగా బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు, బ్రాహ్మణోత్తముల సమక్షంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్‌ మాట్లాడుతూ వేదాలు, శాస్త్రాలు, ఆధ్యాత్మిక విలువలను పరిరక్షిస్తూ సమాజానికి మార్గనిర్దేశం చేస్తున్న వేద పండితుల సేవలు గౌరవనీయమైనవని అన్నారు. సమాజంలో నైతిక విలువలు, ఆధ్యాత్మిక చైతన్యం, సాంస్కృతిక వారసత్వాన్ని మరింత బలోపేతం చేయాలంటే వేద సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వేదాలు కేవలం ఆధ్యాత్మిక జ్ఞానానికి మాత్రమే కాకుండా మానవతా విలువలు, క్రమశిక్షణ, సమాజ శ్రేయస్సుకు మార్గదర్శకాలని పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి కార్యక్రమాలకు తాము ఆతిథ్యం ఇచ్చినట్లు గుర్తు చేశారు.పటాన్‌చెరు నియోజకవర్గంలో బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని జిఎంఆర్‌ తెలిపారు. పేద బ్రాహ్మణులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయడంతో పాటు సొంత నిధులతోనూ సహాయం చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం భవనం నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
చతుర్వేద సదస్సు వంటి కార్యక్రమాలు వేద సంప్రదాయాలను యువతకు చేరువ చేయడంతో పాటు ప్రాచీన జ్ఞాన సంపదపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో పటాన్‌చెరు బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వాసుదేవరావు, రామచంద్రాపురం మండల కార్యదర్శి చంద్రశేఖర్‌ జోషి, సంగారెడ్డి జిల్లా సభ్యుడు వామనభట్ల ప్రకాశశర్మ, తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్ధక సభ సభ్యులు, వేద పండితులు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ప్రతినిధులు, నిర్వాహకులు, భక్తులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.