telanagana
వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బండమాదారంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
మేడ్చల్, మేజర్ న్యూస్ : ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని బండమాదారం 19వ వార్డులో బతుకమ్మ పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. మహిళల ఆటపాటలు, బతుకమ్మ పాటలతో వార్డులో పండుగ సందడి నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ఆత్మీయ అనుబంధాలకు నిదర్శనమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. వేడుకల్లో పాల్గొన్న మహిళలకు వైస్ చైర్మన్ రజిత దేవేందర్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.