BREAKING
1998 తర్వాత గరిష్ట స్థాయికి గిల్ట్ ఈల్డ్స్, కుప్పకూలిన బ్యాంకుల షేర్లు 30వ వార్డు సమస్యలపై శిరీషా ఫోకస్ కిల్‌సెక్ హ్యాకర్ గ్రూప్ 16 ఏళ్ల లీడర్‌ను అరెస్ట్ చేసిన స్పానిష్ పోలీసులు కోనసీమ వాసుల దశాబ్దాల కలకు ఊతం.. నోటీస్ ఇవ్వకుండానే భూమి బదలాయింపు ఎలా? * తీవ్ర అన్యాయం జరిగిందంటూ భావిశెట్టి శేఖర్ ఆరోపణ ధాన్య నిల్వల్లో రసాయన మందులకు ప్రత్యామ్నాయం ఘనంగా జీఎంసీ బాలయోగి 75వ జయంతి వేడుకలు.. యూఈ వాణిజ్య కమిషనర్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాజీ లోక్‌సభ స్పీకర్ బాలయోగి ఆశయ సాధనకు పునరంకితం అవుదాం..: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. జనసేనలోకి చేరిన వైసీపీ శ్రేణులు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆధ్వర్యంలో భారీగా పార్టీ కండువాలు కప్పుకున్న నాయకులు బాలయోగితో అనుబంధం... మరచిపోలేని జ్ఞాపకాలు..: ఎమ్మెల్సీ కుడుపూడి... గంజలి బడే సాబ్ దర్గాలో సోమనాథ్ అన్నదానం ఘనంగా ప్రారంభమైన జాతర మహోత్సవం -పోలేరమ్మ జాతరతో పులకించిన వెంకటగిరి -జాతరకు రాష్ట్ర పండుగా హోద... 50 లక్షలు మంజూరు -ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు -పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి - అమ్మవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం - జై పోలేరమ్మ తల్లి నినాదాలతో మారి మ డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ 13 లక్షల అవినీతి స్కాం బాక్సాఫీస్ వద్ద అద్భుతం సృష్టించేందుకు సిద్ధమైన ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.. భారీ అంచనాలు

వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ లో ఘనంగా సైన్స్ ఫెయిర్

Select Suryaa Now
వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ లో ఘనంగా సైన్స్ ఫెయిర్

*వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్లో ఘనంగా సైన్స్ ఫెయిర్*

*విద్యార్థుల ప్రతిభ అమోఘం

*ఆకట్టుకున్న 120కి పైగా ప్రదర్శనలు.

*ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్ఐ నరేష్, సర్పంచ్ తమ్మడపల్లి కుమార్.

ఇనుగుర్తి, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్ (సూర్య): ఇనుగుర్తి మండల కేంద్రంలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ ప్రదర్శన అత్యంత వైభవంగా జరిగింది. విద్యార్థులు తమ ప్రతిభతో రూపొందించిన 120కి పైగా సైన్స్ ఎగ్జిబిట్లు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరేష్ విశిష్ట అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ప్రతి ఎగ్జిబిట్‌‌ను పరిశీలిస్తూ విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారిలో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానం, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులను, పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ విద్యార్థుల నైపుణ్యాన్ని ప్రశంసించారు. ఇంత చిన్న వయసులోనే శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించి అద్భుతమైన నమూనాలను తీర్చిదిద్దడం గర్వకారణమని, విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య మాట్లాడుతూ.. "సైన్స్ ఫెయిర్ అనేది విద్యార్థుల ప్రతిభకు, సృజనాత్మకతకు అద్దం పట్టే చక్కని వేదిక. పర్యావరణ పరిరక్షణ, శక్తి వనరులు, ఆధునిక సాంకేతికత, ఆరోగ్యం, వైద్యం, అలాగే అతివృష్టి-అనావృష్టి వంటి సమకాలీన సమస్యలకు పరిష్కారాలు చూపేలా విద్యార్థులు 120 ప్రదర్శనలను సిద్ధం చేశారు. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం" అని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ కొట్టం రాము, వార్డు సభ్యులు శ్రీకాంత్, అనూష, పేరెంట్స్ కమిటీ సభ్యులు కవిత, మానస, మాధవి, సబియా బేగం, రఘు, సలీం, ఉపాధ్యాయ బృందం శిరీష, అప్సర, నవ్య, షాహీన్, శ్రీలత, స్రవంతి తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.