BREAKING
రామాయణం నుంచి బిగ్ అప్డేట్.. రాణి కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా చడ్ఢా లుక్స్ విడుదల రూ '2,17,100' విలువగల పిడిఎస్ బియ్యం వాహనంతో పట్టివేత గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ పంపిణీ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం -- ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ 38 కేజీల గంజాయి పట్టివేత ముగ్గురి అరెస్టు చోడవరం ఆది ఆంధ్ర పాఠశాలలో ప్రమాదకర పరిస్థితులు! ప్రేమలు క్రేజ్.. ఏకంగా 50 రెట్లు పెరిగిన నటి మమితా బైజు రెమ్యునరేషన్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల విషయంలో టీడీపీ కట్టుబడి ఉంది – ఇన్చార్జి పొత్తూరి రామరాజు కంటి చూపు పై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి *తిరుపతి విమానాశ్రయం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి : తిరుపతి ఎంపీ గురుమూర్తి* తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలించాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌ నాయుడుకు ఆయన లేఖ రాశారు. తి *పాలకొల్లులో ప్రపంచ తపాలా దినోత్సవ వేడుకలు.* *తపాలా సిబ్బందికి యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ఘన సత్కారం.* సిగ్మా మూవీ నుంచి 'సులోచన' ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్.. కుర్రాళ్లను ఊపేస్తున్న తమన్ మ్యూజిక్ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపాని వీడి తెదేపాలో చేరిక ప్రతిష్టాత్మకమైనా... ప్రశాంతంగానే ముగిసిన ఎస్.రాయవరం హైస్కూల్ ఎన్నికలు! డిజిటల్ విధానంలో ఎరువుల విక్రయాలు – ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌పై అవగాహన కార్యక్రమం* ప్రపంచ బ్యాంకు సమావేశాలకు గైర్హాజరుకానున్న అమెరికా ఆర్థిక మంత్రి బెసెంట్

టీబీ నిర్మూలనకు... జోష్ టీమ్ శ్రీకారం

Select Suryaa Now
టీబీ నిర్మూలనకు... జోష్ టీమ్ శ్రీకారం

-యువత, విద్యార్థులతో ప్రజల్లో అవగాహన కల్పించాలి

రంగారెడ్డి జిల్లాలో టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా టీబీ నిర్మూలన లక్ష్యంతో జోష్ టీమ్ (JOSH – Join Our Support to End TB) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి అధ్యక్షతన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, దేశంలో టీబీ నిర్మూలన లక్ష్య సాధనలో జోష్ టీమ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. యువత, విద్యార్థులు టీబీపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాధి లక్షణాలు ఉన్న అనుమానితులను గుర్తించి, సమీప ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లేలా చొరవ చూపాలని పిలుపునిచ్చారు. టీబీ నివారణ, ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీపీఓ, డీఈఓ, టీబీ అధికారులు, వైద్య అధికారులు, వైద్య సిబ్బంది, జోష్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

రంగారెడ్డి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 08):