BREAKING
వన్యప్రాణి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి.. ప్రాణాపాయ స్థితిలోని బాధితుడికి పునర్జన్మనిచ్చిన వైద్యులు భీమవరంలో మతిస్థిమితం లేని యువకుడు వీరంగం కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మీడియా సమావేశం రేపు ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన కైకలూరు బార్ అసోసియేషన్ లాయర్లను కలిసి సంఘీభావం తెలిపిన కామినేని అగ్రిగోల్డ్ బాధితులు ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తడిసిన అమరేందర్ రెడ్డి మృతి మహిళ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్‌ ,డబ్బులు ఇస్తామని చెప్పి రైతులకు బ్రోమో డయోలిన్ పై అవగాహన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యుడిగా అనగంటి కృష్ణ బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు జీడిపల్లి కిషన్ కుటుంబాన్ని పరామర్శించిన... విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్: రాయలసీమ నేపథ్యంలో బ్రిటీష్ కాలం నాటి సాహస యోధుడు స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి గుడ్డు పోషకాహారానికి చౌకైన వనరు .. ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

టీబీ ముక్త్ పంచాయతీ’ అవార్డు అందుకున్న సర్పంచ్ తీర్పారి నాగమణి ఆంజనేయులు

Select Suryaa Now
టీబీ ముక్త్ పంచాయతీ’ అవార్డు అందుకున్న సర్పంచ్ తీర్పారి నాగమణి ఆంజనేయులు

టీబీ ముక్త్ పంచాయతీ’ అవార్డు అందుకున్న సర్పంచ్ తీర్పారి నాగమణి ఆంజనేయులు

????వెలగలగూడెం గ్రామ పంచాయతీకి టీబీ ముక్త్ పంచాయతీ అవార్డు

మునుగోడు,మేజర్ న్యూస్:

మండలంలోని  వెలగలగూడెం గ్రామ పంచాయతీకి టీబీ ముక్త్ పంచాయతీగా ప్రత్యేక గుర్తింపు లభించింది.గురువారం జిల్లా కేంద్రంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో గ్రామ సర్పంచ్ తీర్పారి నాగమణి ఆంజనేయులు జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ చేతుల మీదుగా అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
గ్రామస్థాయిలో టీబీ వ్యాధి నియంత్రణ, అనుమానితులను గుర్తించడం, అవసరమైన వైద్య పరీక్షలు చేయించడం, వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించినందుకు గ్రామానికి గుర్తింపు లభించింది.
ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ టీబీ నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు గ్రామస్థాయిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. వెలుగులగూడెం పంచాయతీ టీబీ రహిత గ్రామంగా గుర్తింపు పొందేందుకు కృషి చేసిన ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలను అభినందించారు.
గ్రామాన్ని టీబీ రహిత పంచాయతీగా నిలబెట్టడంలో ప్రతి ఒక్కరి సహకారం ఉందని తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. వెలగలగూడెంకు లభించిన ఈ అవార్డుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.