BREAKING
ఆంగ్ల భాష పై నైపుణ్యం సాధించాలి - కలెక్టర్ దివాకర నరజాముల తాండలో వివాదాస్పద భూములపై ఆర్డివో తనిఖీ వచ్చే మార్చిలోగా జిల్లాలో రైతులందరికీ రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు -- సింగవరంలో ఎమ్మెల్యే చింతమనేని తో కలిసి పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్ వెట్రి సెల్వి కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు.. నమూనాల సేకరణ. ఫార్మర్ రిజిస్ట్రేషన్ పరిశీలించిన. జిల్లా వ్యవసాయ అధికారి. మోదీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన కాంగ్రెస్ నాయకులు... స్టేషన్ రోడ్డులో నీళ్ళు రావడం లేదు గుండాల ఆసుపత్రి సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు ? నీటిని పొదుపు చేద్దాం.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పిద్దాం సర్పంచ్ మమత వెంకట్ రెడ్డి మనిషి బ్రతికుంటే ఓటు కావాలి చనిపోతే ఆరడుగుల స్థలం దొరకని దుస్థితి అమిత్ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో దైవాలరావూరు భూములకు విముక్తి. రోడ్డుకు ఇరువైపుల గల, పిచ్చి మొక్కలు తొలగింపు. భద్రాచలం రహదారి సమస్యపై హరీష్ రావుకు వినతి. రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల కరపత్రం ఆవిష్కరణ

బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి ప్రతి ఆడబిడ్డ ఆనందంగా.. ప్రతి కుటుంబం సంతోషంగా బతుకమ్మ జరుపుకోవాలి : మంత్రి సీతక్క

Select Suryaa Now
బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి  ప్రతి ఆడబిడ్డ ఆనందంగా.. ప్రతి కుటుంబం సంతోషంగా బతుకమ్మ జరుపుకోవాలి  : మంత్రి సీతక్క

తెలంగాణ బ్యూరో ప్రతినిధి:తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా, ఆనందంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, తాగునీరు, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

దక్షిణాఫ్రికాలో సౌత్ ఆఫ్రికా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతితో దానికి ఉన్న అనుబంధాన్ని వివరించారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలంగాణ బిడ్డలు బతుకమ్మను ఘనంగా జరుపుకోవడం గర్వకారణమని అన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సందర్భంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ప్రకృతిని, పూలను, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కలిపి జరుపుకునే ప్రత్యేకమైన పండుగ అని పేర్కొన్నారు. “బతుకమ్మ అంటే పూల పండుగ మాత్రమే కాదు.. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక. మన సంస్కృతి, మన సంప్రదాయం, మన ప్రకృతితో ముడిపడిన పండుగ. ప్రతి ఆడబిడ్డ ఆనందంగా.. ప్రతి కుటుంబం సంతోషంగా.. ప్రతి గ్రామం సురక్షితంగా బతుకమ్మ జరుపుకునేలా ప్రజా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది” అని మంత్రి సీతక్క తెలిపారు.

బతుకమ్మ పండుగ రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, జిల్లా పంచాయతీ అధికారులు, కలెక్టర్లు సమన్వయంతో పనిచేసి పండుగకు ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గ్రామాలు, బతుకమ్మ ఆడే ప్రదేశాలు, చెరువులు, కుంటలు, ఘాట్‌ల పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.

బతుకమ్మ ఆడే ఘాట్‌లకు వెళ్లే మార్గాలను పూర్తిగా శుభ్రం చేయాలని, రహదారులపై గుంతలు ఉంటే వెంటనే పూడ్చాలని సూచించారు. ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు ఉండేలా అవసరమైన చోట్ల రోడ్ల మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. 
ఘాట్‌ల పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్‌ చల్లడంతో పాటు పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం ఉంటే తొలగించాలని ఆదేశించారు. బతుకమ్మ వేదికలను ముందుగానే శుభ్రం చేసి సిద్ధం చేయాలని, అవసరమైన చోట్ల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బతుకమ్మ ఘాట్‌లకు సరైన రహదారి సౌకర్యం లేని ప్రాంతాల్లో వీబీజీ రామ్‌ జీ పథకం కింద మట్టి రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

బతుకమ్మ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, చిన్నారులు పాల్గొంటారని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. అవసరమైన చోట్ల మెట్లు, ర్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు.ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిధుల కొరత కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని తెలిపారు.

*ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతి చాటుతున్న బతుకమ్మ*

తెలంగాణలో పుట్టిన బతుకమ్మ పండుగ నేడు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఆడబిడ్డల ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని మంత్రి సీతక్క అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, మధ్యప్రాచ్యం, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో తెలంగాణ ప్రజలు బతుకమ్మను జరుపుకోవడం మన సంస్కృతి గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.

“ఎక్కడ ఉన్నా తెలంగాణ బిడ్డల గుండెల్లో బతుకమ్మ ఉంటుంది. పూలను పేర్చి బతుకమ్మను నిలబెట్టినట్టే.. మన సంస్కృతి, సంప్రదాయాలను కూడా తరతరాలకు నిలబెట్టుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఆడబిడ్డలంతా ఐక్యంగా, ఆనందంగా బతుకమ్మను జరుపుకోవాలి” అని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ప్రతి ఇంటా ఆనందాన్ని, ప్రతి కుటుంబంలో సంతోషాన్ని, ప్రతి గ్రామంలో ఐక్యతను నింపాలని మంత్రి సీతక్క ఆకాంక్షిస్తూ.. రాష్ట్రంలోని మహిళలందరికీ ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.