BREAKING
భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు రోజంతా సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో జరిగే అనర్థాలు ఇవే.. డీహైడ్రేషన్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న రియల్ స్టోరీ క్రైమ్ థ్రిల్లర్.. వీకెండ్‌లో చూసేందుకు అద్భుతమైన మూవీ కొప్పర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి - సిపిఎం వట్టిప్రోలు రంగారావు ను సత్కరించిన...... వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు షేక్ నాజర్ లీజుకు తీసుకున్న బస్సులు అమ్ముకున్నారని ఆరోపణ.. బాధితులకు న్యాయం చేయాలి అంటున్న నల్లి రాజేష్.* అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్.. కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం నటించని స్టార్ హీరోయిన్ కార్మికుల కొరత పరిష్కారానికి లావోస్ తీవ్ర కసరత్తు: స్వర్ణాంధ్ర కాలేజి ని సందర్శించిన నాక్ ఈసీ కమిటీ చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి.. ఏమన్నారంటే?

మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో దైవాలరావూరు భూములకు విముక్తి.

Select Suryaa Now
మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో దైవాలరావూరు భూములకు విముక్తి.

దశాబ్ద కాలంగా పరిష్కారం కాని సమస్యకు తెర.. నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు.

సూర్య కొరిసపాడు.

మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో దైవాలరావూరు గ్రామస్తుల దశాబ్ద కాలం నాటి భూముల సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామానికి చెందిన గ్రామ కంఠం భూములను దేవాదాయ శాఖ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఈ ఉత్తర్వులు గ్రామస్తులకు అందడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ఊరట లభించింది. దైవాలరావూరు గ్రామానికి చెందిన సర్వే నంబర్ 253లోని మొత్తం భూమిని దేవాదాయ శాఖ నిషేధిత జాబితాలో ఉంచింది. అయితే, వాస్తవానికి ఈ సర్వే నంబర్‌లో శ్రీ చెన్నకేశవ స్వామివారికి చెందిన 29 సెంట్ల భూమి మాత్రమే దేవాదాయ శాఖకు సంబంధించినది. మిగిలిన భూములపై రిజిస్ట్రేషన్లు జరగక గ్రామస్తులు సంవత్సరాల తరబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలుమార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రెండు నెలల క్రితం దైవాలరావూరు గ్రామస్తులు తమ సమస్యను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తుల సమస్యను విన్న మంత్రి వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. భూములకు సంబంధించిన పూర్తి వివరాలు, అవసరమైన పత్రాలను పరిశీలించి, నిషేధిత జాబితా నుంచి అర్హత ఉన్న భూములను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు అన్ని పత్రాలను దేవాదాయ శాఖకు సమర్పించారు. పత్రాలను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్.. సర్వే నంబర్ 253/1లోని 26.42 సెంట్ల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏళ్ల తరబడి తమ సొంత భూములపై హక్కులు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు చేసుకోలేక ఎదురుచూసిన గ్రామస్తుల నిరీక్షణకు తెరపడింది. తమ సమస్యను అర్థం చేసుకుని వెంటనే స్పందించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతోనే ఇది సాధ్యమైందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్ద కాలంగా తమకు తీరని సమస్యగా ఉన్న భూముల వ్యవహారం ఒక్కసారిగా పరిష్కారం కావడంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. “ఎన్నో ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాలేదు.. మంత్రి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లిన కొద్ది కాలంలోనే సమస్య పరిష్కారమైంది” అంటూ గ్రామస్తులు భావోద్వేగంతో పేర్కొన్నారు. తమ భూములకు రిజిస్ట్రేషన్‌కు మార్గం సుగమం చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు దైవాలరావూరు గ్రామస్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.