రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల కరపత్రం ఆవిష్కరణ
మార్కాపురం మేజర్ న్యూస్
మార్కాపురం జిల్లా కేంద్రంగా నిర్వహించనున్న 52వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ ఛాంపియన్‌షిప్–2026 పోటీల కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని 28 జిల్లాల నుంచి పాల్గొనే క్రీడాకారులు, క్రీడా శిక్షకులకు వారు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో అనతి కాలంలోనే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించేందుకు ముందుకు వచ్చిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. పోటీలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.రాష్ట్రస్థాయి పోటీలకు వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి అవసరమైన సౌకర్యాలు, ఏర్పాట్లపై నిర్వాహకులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి రాష్ట్రస్థాయి పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు.