దేశం నేత నాయుడుకు వినతి పత్రం అందజేసిన వీఆర్ఏలు
నర్సాపురం, మేజర్ న్యూస్:గ్రామ రెవెన్యూ సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు కి వీఆర్ఏలు వినతిపత్రం అందజేసారు. గురువారం నాయుడు నివాసానికి చేరుకున్న సంఘం ప్రతినిధులు జీతాలు పేస్కేల్ జీతాలు అమలు చేయాలని, అర్హులైన వారికి గ్రేడ్-2 వీఆర్‌వోలుగా పదోన్నతులు కల్పించాలని, నామినీ వీఆర్‌ఏలను క్రమబద్ధీకరించాలని కోరారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయుడు హామీ ఇచ్చారు.
రిపోర్టర్ ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా