నేటి నుండి ఇంటింటికి వెళ్లి ఓటర్ల పరిస్థితిని పునః పరిశీలించాలి
ఏలూరు, మేజర్ న్యూస్ : అర్హులైన ప్రతీ ఒక్కరిని ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఈనెల 8వ తేదీ నుండి జిల్లాలో ఇంటింటికీ వెళ్లి, ఆ ఓటర్ల ప్రస్తుత స్థితిని పునఃపరిశీలిస్తారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. 'ప్రత్యేక సమగ్ర సవరణ - 2026' లో భాగంగా నోటీసు దశలో (గైర్హాజరైన, స్థానచలనం చెందిన, మరణించిన లేదా ద్వంద్వ నమోదు కలిగిన) ఓటర్లు/అనర్హ ఓటర్ల స్థితిని పునఃపరిశీలించడం , కొత్త ఓటర్లు/జాబితాలో చేరని ఓటర్ల నమోదు కోసం ఒక 'ప్రత్యేక కార్యక్రమాన్ని' చేపట్టాలని కమిషన్ నిర్ణయించిందన్నారు. తొలగించిన ఓటర్లను స్థితిని బిఎల్వోలు పరిశీలిస్తారని, తొలగించిన ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాల్లో పరిశీలనకు ఉంచుతారన్నారు. ఈ సందర్భాలలో ఏదైనా ఓటరు పేరు పొరపాటున తొలగించబడినట్లు గుర్తిస్తే, వారికి 'ఫారం-6' నింపే అవకాశం కల్పించబడుతుందన్నారు. "అర్హులైన ప్రతి ఓటరు పేరును ఓటర్ల జాబితాలో చేర్చడం , అనర్హుల పేర్లను తొలగించడం కార్యక్రమంలో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. 'నిరంతర అప్‌డేషన్' ప్రక్రియ ద్వారా వారి పేరు ఓటర్ల జాబితాలో చేర్చబడుతుందన్నారు. .జిల్లాలో సర్ 2026 (ప్రత్యేక సారాంశ సవరణ) కింద తుది ఓటర్ల జాబితా 16.10.2026న ప్రచురించబడుతుందన్నారు. ఈనెల 16వ తేదీన ప్రచురించబడే తుది జాబితాలో పేరు లేని ఓటర్లు మరియు తదుపరి అర్హత తేదీలలో అర్హత సాధించే వ్యక్తులు, 'నిరంతర అప్‌డేషన్' సమయంలో తమ పేరు నమోదు కోసం 'ఫారం-6'ను సమర్పించవచ్చన్నారు.
బ్యూరో ఇన్చార్జ్ కె బాలసౌరి, ఏలూరు