సీఐ అలీ కుటుంబానికి 13 లక్షల 50 వేలు ఆర్థిక సాయం ఏపీ తెలంగాణ 1996 బ్యాచ్ పోలీస్ అధికారుల వితరణ
దెందులురు సూర్య న్యూస్ విధి నిర్వహణలో మృతి చెందిన గోపన్నపాలెం కు చెందిన విజయవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ అలీ కుటుంబానికి 13 లక్షల 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పోలీస్ అధికారులు తమ గొప్ప మనసు ఔదార్యాన్ని చాటుకున్నారు. బుధవారం గోపన్నపాలెంలో సి ఐ మహమ్మద్ అలీ నివాసంలో ఆయన సంస్మరణ సభ ను నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన సేవలను కొనియాడారు.సిఐ అలీ బ్యాచ్ మేట్ స్నేహితుడు విజయవాడ ట్రాన్స్కో విజిలెన్స్ సిఐ కోమాకుల శివాజీ మాట్లాడుతూ 1,50,000 పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయడం జరుగుతుందన్నారు మిగిలిన 12 లక్షల రూపాయలు చిన్నారుల పేరు మీద మ్యూచువల్ ఫండ్స్ లో జమ చేసి పత్రాలను అలీ కుటుంబానికి అందించడం జరుగుతుందన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన 1996 బ్యాచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ అలీ కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు విశిష్ట సహాయ సహకారాలు అందించిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పోలీస్ అధికారులు ఏలూరు రేంజ్ పరిధిలో 1985 1989 1991 బ్యాచ్ అధికారులు విశ్రాంత అధికారులు అందరికీ సిఐ శివాజీ కృతజ్ఞతలు తెలిపారు.
బ్యూరో బాలశౌరి , ఏలూరు