అద్దంకిలో మహిళా సాధికారత, చట్టాలపై అవగాహన ర్యాలీ.
సూర్య అద్దంకి.
మహిళా సాధికారత, మహిళలకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించేందుకు మండల న్యాయ సేవా అధికార సంస్థ, అద్దంకి ఆధ్వర్యంలో కోర్టు నుండి బంగ్లా రోడ్డు వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ సివిల్ జడ్జి - డి. నాగ వెంకట లక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. మహిళలకు వారి హక్కులు, చట్టపరమైన రక్షణపై అవగాహన మహిళా సాధికారతను మరింత బలోపేతం చేయడం బాల్యవివాహాలు లైంగిక వేధింపులు ఆడపిల్లల విద్య అంశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్స్ విల్ జడ్జి శ్రీ సీత బార్ అసోసియేషన్ అధ్యక్షులు రామకోటయ్య, తదితరులు ఉన్నారు.