రోడ్డుకు ఇరువైపుల గల, పిచ్చి మొక్కలు తొలగింపు.
రోడ్డుకు ఇరువైపుల గల, పిచ్చి మొక్కలు తొలగింపు.
వట్టిపల్లి ,.వట్టిపల్లి మండలం లోని ఉసిరిక పల్లి గ్రామ శివారులో రోడ్డుకు ఇరువైపుల పిచ్చి మొక్కలు, ముండ్ల పొదలు, గడ్డి, విపరీతంగా పెరగడం చేత వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుచున్నది. రాత్రిపూట డ్రైవింగ్ ఇబ్బందికరంగ మారినది .ఇది గుర్తించిన గ్రామ సర్పంచ్ షిర్గాపురం శ్రీకాంత్ రెడ్డి చొరవ తీసుకొని, జెసిబి సహాయంతో పిచ్చి మొక్కలు ,పొదలు, గడ్డి తొలగింపజేసినారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి ,ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీ నర్సింలు, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు ,విజేందర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.