నీటిని పొదుపు చేద్దాం.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పిద్దాం సర్పంచ్ మమత వెంకట్ రెడ్డి
నీటిని పొదుపు చేద్దాం.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పిద్దాం సర్పంచ్ మమత వెంకట్ రెడ్డి
రాయికోడ్, : నీటిని పొదుపుగా వినియోగించి భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించాలని సంగాపూర్ గ్రామ సర్పంచు మమత వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. నీరు ప్రతి ఒక్కరి జీవనాధారమని, అందువల్ల ప్రతి ఒక్కరూ అవసరమైన మేరకే నీటిని వినియోగించాలని సూచించారు.
ఇంటి కుళాయిలను అవసరం లేనప్పుడు తప్పనిసరిగా మూసివేయాలని, నీటిని వృథాగా పారబోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కుళాయిలు, పైపుల్లో లీకేజీలు ఉంటే వెంటనే గ్రామపంచాయతీకి సమాచారం అందించాలని తెలిపారు. తాగునీటిని ఇతర అవసరాలకు వృథా చేయకుండా, అందరికీ సరిపడేలా వినియోగించుకోవాలని సూచించారు.
నీటిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ మమత వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. “నీటిని పొదుపు చేద్దాం.. భావితరాలకు భవిష్యత్ భద్రత కల్పిద్దాం” అని వారు పిలుపునిచ్చారు.