BREAKING
చిన్నారుల ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో ముఖ్యం తూప్రాన్ విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట టీబీ ముక్త భారత్‌ అభియాన్‌లో జోష్ టీమ్‌ ప్రారంభం ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధికి 7 కోట్లు నిధులు వెట్టిచాకిరీ నిర్మూలనకు ‘స్వేచ్ఛా రథం’ పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం పోషణ మాసోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జ్యోతి నగర్ అంగన్వాడి కేంద్రంలో ముగిసిన 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు నీటి కోసం పాట్లు..!అర కిలోమీటర్ విద్యార్ధినుల నడక..! శనీశ్వర స్వామి వారి దర్శించుకున్న మెప్ప డైరెక్టర్ గ్రామీణ కళాకారులను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి టీబీ నిర్మూలనకు... జోష్ టీమ్ శ్రీకారం విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి సహకారం అందిస్తాం రైతు పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు

వన్యప్రాణి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి..

Select Suryaa Now
వన్యప్రాణి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి..

ఆవాసాల అనుసంధానం..  వృద్ధి చెందుతున్న జాతులు...  నినాదపు ఇతివృత్తంతో.. 72వ వన్యప్రాణి  వారోత్సవాలు...  నెల్లూరు రేంజ్ ఆఫీసర్   ఎస్ మాల్యాద్రి పిలుపు...

నెల్లూరు,  వేదాయపాలెం,  మేజర్ న్యూస్  :   ప్రకృతి ప్రసాదించిన స్వచ్ఛమైన.. ఆహ్లాదకరమైన అటవీ వనరులను ఆవాసాలుగా చేసుకొని హాయిగా జీవిస్తున్న అమాయక వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అటవీఉద్యోగుల తోపాటు ప్రజలందరిపై ఉందని అటవీ టెరిటోరియల్ విభాగం నెల్లూరు రేంజ్ ఆఫీసర్   ఎస్ మాల్యాద్రి పిలుపునిచ్చారు.72వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...జిల్లా ఇన్చార్జి అటవీఅధికారి శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు రేంజ్ ఆధ్వర్యంలో ఈనెల 2న గాంధీ జయంతి రోజున ప్రారంభించి గురువారం వరకు వారం రోజులపాటు నిర్వహించిన వన్యప్రాణి వారోత్సవాల కార్యక్రమాల ద్వారా జీవవైవిధ్య పరిరక్షణపై  ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.  ఆవాసాల అనుసంధానం.. వృద్ధి చెందుతున్న వన్యప్రాణులు  అనే అంశంతో కూడిన ఇతివృత్తంతో 72వ వన్నెప్రాణి వారోత్సవ కార్యక్రమాలు ఈ నెల 2 నుంచి 8 వరకు  రోజులపాటు నిర్వహించిన అవగాహన సదస్సుల్లో భాగంగా ప్రకృతి ప్రసాదించిన అటవీ వనరులు- వన్యప్రాణుల ప్రాముఖ్యత..అడవి జంతువుల ఆవాసాల పరిరక్షణ.. ఆవశ్యకత.. అక్రమ వేట వల్ల ఎదురయ్యే ప్రాణ నష్టాలు.. తదితర అంశాలపై ప్రయోగాత్మక చర్యల ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించడం జరిగిందన్నారు. వన్యప్రాణుల ఆవశ్యకతపై అటు ప్రజలు..ఇటు యువత.. ముఖ్యంగా అటవీ ప్రాంతాలతో మమేకమై ఉండే  గిరిజనుల్లో పూర్తిస్థాయి అవగాహన పెంపొందించేందుకే వన్యప్రాణి వారోత్సవాలు కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన వివరించారు.