ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధికి 7 కోట్లు నిధులు
రేపల్లె మేజర్ న్యూస్;
పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఏడు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరులు అనగాని శివప్రసాద్ తెలిపారు. గురువారం ఎన్టీఆర్ కాలనీలో శివప్రసాద్ బజారు బజారుకు తిరిగి ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు ఆ సమస్యలను మంత్రి అనగానీి సత్యప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలనీలో ప్రధాన రహదారుల నిర్మాణం కొరకు మూడు కోట్ల రూపాయలను మంజూరు చేశారని అదేవిధంగా అమృత 2.0 భాగంగా నాలుగు కోట్ల రూపాయలతో మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేసి పై పైప్ లైన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొనాలి ఏర్పాటు చేస్తామని తెలిపారు వార్డులో ప్రతి వీధికి సిసి రోడ్డు నిర్మాణం చేపట్టి మురుగు కాలువలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిరంతరం విద్యుత్ సరఫరాను కూడా అందిస్తున్నామని తెలిపారు. కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటి పరిష్కారానికి మార్గం చూపుదామని కాలనీవాసులకు మరోసారి కల్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే సాంబశివరావు, డీఈ మధుసూదన్ రావు, ఏఈ సామ్యూల్ జాన్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు పంతాన్ని సాయికుమార్, దున్న జయప్రద, దేవగిరి రవి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.