దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి
మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాలు, తండాలలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో దసరా పండుగనుజరుపుకోవాలని మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, కౌన్సిలర్లు వెంకటయ్య, మహేష్, జగన్, భాగ్యమ్మ, అనూష శ్రీశైలం, కో ఆప్షన్ సభ్యుడు ఖాదర్, గుర్రం కేశవులు, భాస్కర్ లు కోరారు. బతుకమ్మ పండుగ కోసం, హనుమాన్ దేవాలయం, గాంధీ చౌక్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ దసరా ఉత్సవాలు విజయవంతం చేయడానికి మున్సిపల్ పాలకవర్గం, ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బతుకమ్మల నిమజ్జనం కోసం చెరువు వద్ద ఘాట్ పరిశీలన, దసరాపండుగ రోజు రచ్చ కట్ట వద్ద నుంచి కాలేజ్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అనంతరం కాలేజ్ గ్రౌండ్ లో రావణ దహనం కార్యక్రమం ఉంటుందని చెప్పారు. దసరా ఉత్సవాలు విజయవంతం చేయడానికి అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, ఏఎస్ఐ రామ్ రెడ్డి, నాయకులు సత్యం, సురేష్ నాయక్, శివ, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఎ. చంద్రశేఖర్: నేచర్ న్యూస్, ఆమనగల్లు.