BREAKING
నరజాముల తాండలో వివాదాస్పద భూములపై ఆర్డివో తనిఖీ వచ్చే మార్చిలోగా జిల్లాలో రైతులందరికీ రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు -- సింగవరంలో ఎమ్మెల్యే చింతమనేని తో కలిసి పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్ వెట్రి సెల్వి కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు.. నమూనాల సేకరణ. ఫార్మర్ రిజిస్ట్రేషన్ పరిశీలించిన. జిల్లా వ్యవసాయ అధికారి. మోదీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన కాంగ్రెస్ నాయకులు... స్టేషన్ రోడ్డులో నీళ్ళు రావడం లేదు గుండాల ఆసుపత్రి సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు ? నీటిని పొదుపు చేద్దాం.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పిద్దాం సర్పంచ్ మమత వెంకట్ రెడ్డి మనిషి బ్రతికుంటే ఓటు కావాలి చనిపోతే ఆరడుగుల స్థలం దొరకని దుస్థితి అమిత్ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో దైవాలరావూరు భూములకు విముక్తి. రోడ్డుకు ఇరువైపుల గల, పిచ్చి మొక్కలు తొలగింపు. భద్రాచలం రహదారి సమస్యపై హరీష్ రావుకు వినతి. రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల కరపత్రం ఆవిష్కరణ సబ్‌స్టేషన్లలో విద్యుత్ సామర్థ్యం పెంపు

విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి సహకారం అందిస్తాం

Select Suryaa Now
విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి సహకారం అందిస్తాం

విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి సహకారం అందిస్తాం

-పాఠశాల విద్యార్థులకు బూట్ల పంపిణీ

-నారాయణరావుపేట సర్పంచ్ ఎల్లారెడ్డి

సిద్దిపేట రూరల్, : విద్యార్థుల అభ్యున్నతికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని నారాయణరావుపేట గ్రామ సర్పంచ్ ఎల్లారెడ్డి అన్నారు. గురువారం నారాయణరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు నాగరాజు, ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు బూట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఎల్లారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు.విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, వారి అభివృద్ధికి గ్రామ ప్రజాప్రతినిధులుగా ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.