BREAKING
నరజాముల తాండలో వివాదాస్పద భూములపై ఆర్డివో తనిఖీ వచ్చే మార్చిలోగా జిల్లాలో రైతులందరికీ రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు -- సింగవరంలో ఎమ్మెల్యే చింతమనేని తో కలిసి పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్ వెట్రి సెల్వి కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు.. నమూనాల సేకరణ. ఫార్మర్ రిజిస్ట్రేషన్ పరిశీలించిన. జిల్లా వ్యవసాయ అధికారి. మోదీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన కాంగ్రెస్ నాయకులు... స్టేషన్ రోడ్డులో నీళ్ళు రావడం లేదు గుండాల ఆసుపత్రి సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు ? నీటిని పొదుపు చేద్దాం.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పిద్దాం సర్పంచ్ మమత వెంకట్ రెడ్డి మనిషి బ్రతికుంటే ఓటు కావాలి చనిపోతే ఆరడుగుల స్థలం దొరకని దుస్థితి అమిత్ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో దైవాలరావూరు భూములకు విముక్తి. రోడ్డుకు ఇరువైపుల గల, పిచ్చి మొక్కలు తొలగింపు. భద్రాచలం రహదారి సమస్యపై హరీష్ రావుకు వినతి. రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల కరపత్రం ఆవిష్కరణ సబ్‌స్టేషన్లలో విద్యుత్ సామర్థ్యం పెంపు

టీబీ ముక్త భారత్‌ అభియాన్‌లో జోష్ టీమ్‌ ప్రారంభం

Select Suryaa Now
టీబీ ముక్త భారత్‌ అభియాన్‌లో జోష్ టీమ్‌ ప్రారంభం

సంగంమేజర్ న్యూస్  :      టీబీ వ్యాధి నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త భారత్‌ అభియాన్‌లో భాగంగా సంగం మండలంలో జోష్ ఆరోగ్య సంయుక్త టాస్క్‌ఫోర్స్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ ఖాదర్ వలీ ఆదేశాల మేరకు సంగం మండలంలో కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు క్లాస్‌-1 ఆఫీసర్‌గా ఎంపీడీఓ షాలెట్‌ను, టీమ్‌ సభ్యులుగా మై భారత్‌ వాలంటీర్లు, ఎన్‌సీసీ విద్యార్థులను నియమించారు.  ఈ సందర్భంగా టీబీ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, సకాలంలో వ్యాధి నిర్ధారణ ప్రాధాన్యతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. టీబీ నిర్ధారణ అయిన వారు చికిత్సను మధ్యలో నిలిపివేయకుండా వైద్యుల సూచనల మేరకు పూర్తి కోర్సు మందులు వినియోగించేలా ప్రోత్సహించనున్నారు.  టీబీ వ్యాధికి సంబంధించిన పరీక్షలు, చికిత్స ఉచితంగా అందుబాటులో ఉన్నాయని ప్రజలకు తెలియజేయడంతో పాటు, వ్యాధిపై ఉన్న అపోహలు, తప్పుడు నమ్మకాలు, సామాజిక వివక్షను తొలగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  టీబీని పూర్తిగా నిర్మూలించి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేలా గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించడమే జోష్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ అశోక్‌, టీబీ టెక్నీషియన్లు నరసింహులు, సురేష్‌, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.