27వ ప్రపంచ దృష్టి దినోత్సవకార్యక్రమము
గిద్దలూరు మేజర్ న్యూస్ గిద్దలూరు లోని బాలికల ఉన్నత పాఠశాల యందు 27వ ప్రపంచ దృష్టి దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయబడినది ఈ కార్యక్రమంలో గిద్దలూరుకు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్. జి. కె.మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ దృష్టి దినోత్సవ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము అక్టోబరు నెల రెండోవారంలో గురువారం రోజు నిర్వహించబడును. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 285 మిలియన్ల ప్రజలు దృష్టిలోపంతో బాధపడుతున్నారు. వీరిలో పూర్తిగా చూపు లేని వారు 39 మిలియన్లు ప్రజలు ఉన్నారు.
వీరిలో దాదాపు 90% ప్రజలు అభివృద్ధి చెందిన దేశాలలోనే ఉన్నారు. 50 సంవత్సరములు పైబడిన వారు దాదాపు 82% అందత్వంతో బాధపడుతున్నారు. ఈ అందత్వానికి ముఖ్య కారణాలు, నివారణలు 1.దృష్టిలోపాలు వీటిలో హ్రస్వ దృష్టి,దూర దృష్టి , చత్వారము. వీరికి కంటి పరీక్షల నిర్వహించి కంటి అద్దాల ద్వారా నివారించవచ్చును. 15 సంవత్సరములు పైబడిన పాఠశాల విద్యార్థిని విద్యార్థులు దాదాపు 19 మిలియన్లు మంది హర్షదృష్టితో బాధపడుతున్నారు. ఈ దృష్టిలోపములు నివారించాలంటే పుట్టిన ప్రతి బిడ్డకు 6వనెల, 9వ నెల లోపు ఒక లక్ష ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్" ఏ" ద్రావణము ఇప్పించాలి. అలాగే 18వ నెల నుండి ఐదు సంవత్సరాలు వచ్చే అంతవరకు రెండు లక్షల ఇంటర్నేషనల్ విటమిన్ "ఏ" ద్రావణము ఇప్పించాలి. 2. శుక్లాలు అనగా క్యాటరాక్ట్ ,వీటిని ఐ.ఓ.ఎల్ అనే ఆపరేషన్ ద్వారా నివారించవచ్చును.3. గ్లోకోమా, డయాబెటిస్, రక్తపోటు వలన వచ్చే రెటినోపతి మరియు నెఫ్రోపతి వ్యాధులను, అలాగే వృద్ధాప్యం వలన వచ్చే మ్యాక్యులర్ డిజనరేషన్, మాక్యులర్ ఎడిమా అనే కంటి వ్యాధులను లేజర్ చికిత్స ద్వారా నివారించవచ్చును. మరీ ముఖ్యంగా రక్తపోటు అనగా బీపీ వ్యాధి, డయాబెటిస్ అనగా చక్కెర వ్యాధి కలవారు ప్రతి ఆరు నెలలకోసారి కంటిలోని రెటీనాను కంటి వైద్యునిచే పరీక్షించుకోవాలి. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఇన్చార్జ్ ఎంఈఓ పి. నాగభూషణ్ రెడ్డి మాట్లాడుతూ ఆకుకూరలు,కూరగాయలు మంచి పోషక ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకోవాలని అన్నారు. అక్టోబర్ నెల 30వ తారీకు వరకు దాదాపు 1000 రూపాయలు గల కంటి రెటీనా పరీక్షలు స్థానికంగా ఉన్న డాక్టర్. జి.కె.మోహన్ రెడ్డి కంటి ఆసుపత్రి యందు ఉచితంగా నిర్వహించుకొనవచ్చును. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థినిలు పాల్గొన్నారు