BREAKING
నరజాముల తాండలో వివాదాస్పద భూములపై ఆర్డివో తనిఖీ వచ్చే మార్చిలోగా జిల్లాలో రైతులందరికీ రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు -- సింగవరంలో ఎమ్మెల్యే చింతమనేని తో కలిసి పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్ వెట్రి సెల్వి కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు.. నమూనాల సేకరణ. ఫార్మర్ రిజిస్ట్రేషన్ పరిశీలించిన. జిల్లా వ్యవసాయ అధికారి. మోదీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన కాంగ్రెస్ నాయకులు... స్టేషన్ రోడ్డులో నీళ్ళు రావడం లేదు గుండాల ఆసుపత్రి సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు ? నీటిని పొదుపు చేద్దాం.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పిద్దాం సర్పంచ్ మమత వెంకట్ రెడ్డి మనిషి బ్రతికుంటే ఓటు కావాలి చనిపోతే ఆరడుగుల స్థలం దొరకని దుస్థితి అమిత్ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో దైవాలరావూరు భూములకు విముక్తి. రోడ్డుకు ఇరువైపుల గల, పిచ్చి మొక్కలు తొలగింపు. భద్రాచలం రహదారి సమస్యపై హరీష్ రావుకు వినతి. రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల కరపత్రం ఆవిష్కరణ సబ్‌స్టేషన్లలో విద్యుత్ సామర్థ్యం పెంపు

ఘనంగా జ్యోతి నగర్ అంగన్వాడి కేంద్రంలో ముగిసిన 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు

Select Suryaa Now
ఘనంగా జ్యోతి నగర్ అంగన్వాడి కేంద్రంలో ముగిసిన 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ :    సెప్టెంబర్ 9 తేదీ నుండి  అక్టోబర్ 8వ తేదీ వరకు 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల కార్యక్రమాలో భాగంగా గురువారం నాడు గాంధీనగర్ సెక్టార్ పరిధిలోని జ్యోతి నగర్ అంగన్వాడి కేంద్రం నందు చంద్రమౌళి నగర్ యూ పి హెచ్ సి  డాక్టర్ అన్విత మరియు సెక్టార్ సూపర్వైజర్ పి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ...నెల రోజులుగా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో మన అంగన్‌వాడీ మన బాధ్యత పేరుతో నిర్వహించిన పోషణ మాసోత్సవాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు.అలాగే అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడాన్ని అంగన్‌వాడీ కార్యకర్తలు బాధ్యతగా భావించాలని సూచించారు. ప్రతి చిన్నారిపై వ్యక్తిగత శ్రద్ధ చూపాలన్నారు. ప్రతినెలా క్రమం తప్పకుండా చిన్నారుల బరువు, ఎత్తును నమోదు చేస్తూ వారి వయస్సుకు అనుగుణంగా ఎదుగుదల ఉండేలా పర్యవేక్షించాలన్నారు.బలహీనంగా ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారి తల్లిదండ్రులతో మాట్లాడి అవసరమైన అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కే రమణి, ఏఎన్ఎంలు సుజాత, లూసి మరియు అంగన్వాడి కార్యకర్తలు సరస్వతి,భారతి,పుష్పలత అంగన్వాడి హెల్పర్లు ఆయుష, గర్భవతులు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.