BREAKING
వచ్చే మార్చిలోగా జిల్లాలో రైతులందరికీ రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు -- సింగవరంలో ఎమ్మెల్యే చింతమనేని తో కలిసి పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్ వెట్రి సెల్వి కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు.. నమూనాల సేకరణ. ఫార్మర్ రిజిస్ట్రేషన్ పరిశీలించిన. జిల్లా వ్యవసాయ అధికారి. మోదీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన కాంగ్రెస్ నాయకులు... స్టేషన్ రోడ్డులో నీళ్ళు రావడం లేదు గుండాల ఆసుపత్రి సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు ? నీటిని పొదుపు చేద్దాం.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పిద్దాం సర్పంచ్ మమత వెంకట్ రెడ్డి మనిషి బ్రతికుంటే ఓటు కావాలి చనిపోతే ఆరడుగుల స్థలం దొరకని దుస్థితి అమిత్ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో దైవాలరావూరు భూములకు విముక్తి. రోడ్డుకు ఇరువైపుల గల, పిచ్చి మొక్కలు తొలగింపు. భద్రాచలం రహదారి సమస్యపై హరీష్ రావుకు వినతి. రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల కరపత్రం ఆవిష్కరణ సబ్‌స్టేషన్లలో విద్యుత్ సామర్థ్యం పెంపు 27వ ప్రపంచ దృష్టి దినోత్సవకార్యక్రమము

రైతు పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు

Select Suryaa Now
రైతు పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు

రైతు పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

ఎమ్మిగనూరు పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్‌రెడ్డితో సీపీఐ నేతలు భేటీ అయ్యారు. ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం మండలాలను తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించాలనే డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ చేపడుతున్న రైతు పోరుబాటకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సీపీఐ నేతలు తెలిపారు.
ఈ సందర్భంగా మూడు మండలాల్లో నెలకొన్న కరువు పరిస్థితులు, వర్షాభావంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పంట నష్టంపై చర్చించారు. కరువు పరిస్థితులను ప్రభుత్వం గుర్తించి, రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టే పోరాటంలో కలిసి ముందుకు సాగుతామని సీపీఐ నేతలు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి.రంగన్న, భాస్కర్‌యాదవ్, గోనెగండ్ల, నందవరం నాయకులు మద్దిలేటి నాయుడు, విజేంద్ర తదితరులు పాల్గొన్నారు.