BREAKING
టీబీ ముక్త భారత్‌ అభియాన్‌లో జోష్ టీమ్‌ ప్రారంభం ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధికి 7 కోట్లు నిధులు వెట్టిచాకిరీ నిర్మూలనకు ‘స్వేచ్ఛా రథం’ పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం పోషణ మాసోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జ్యోతి నగర్ అంగన్వాడి కేంద్రంలో ముగిసిన 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు నీటి కోసం పాట్లు..!అర కిలోమీటర్ విద్యార్ధినుల నడక..! శనీశ్వర స్వామి వారి దర్శించుకున్న మెప్ప డైరెక్టర్ గ్రామీణ కళాకారులను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి టీబీ నిర్మూలనకు... జోష్ టీమ్ శ్రీకారం విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి సహకారం అందిస్తాం రైతు పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు విజ్ఞాన యాత్రకు తరలిన రైతులు విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్ విడుదల: దసరా బరిలో అంచనాలు పెంచుతున్న భారీ చిత్రం

రేపు ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన

Select Suryaa Now
రేపు ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన

*గర్భ కండ్రిక భూ సమస్యలకు పరిష్కారం*

*పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు

సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

 ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటించనున్నారు. జరుగుమల్లి మండలంలోని నర్సింగుల గ్రామంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. ప్రత్యేకించి దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న గర్భ కండ్రిక భూ సమస్యలకు సీఎం పరిష్కారం చూపనున్నారు. మొత్తం 4 మండలాల్లో 8 గ్రామాల్లో విస్తరించిన 2915 ఎకరాల భూములను వివాదాల నుంచి తొలగించి 1301 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. కొండపి మండలంలోని ఇలవర, వెన్నూరు, జరుగుమల్లి మండలంలోని పచ్చవ, వర్దినేనిపాలెం, నర్సింగోలు, కె.బిట్రగుంట, నాగులుప్పలపాడులోని ఓబన్నపాలెం, సింగరాయకొండలోని కాలికివాయ గ్రామాల్లో గర్భ కండ్రిక భూములకు వివాదాల నుంచి విముక్తి కల్పించనున్నారు. మొత్తంగా ఈ అక్టోబరు నెలలో 4.58 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని సీఎం నిర్ణయించారు. ఉదయం అమరావతి నుంచి బయల్దేరి ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్సింగోలుకు చేరుకోనున్నారు. గ్రామంలోని స్థానిక రైతులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. 8 గ్రామాల్లోని రైతులకు గర్భకండ్రిక భూముల  సమస్యలను పరిష్కరించి పట్టాలు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 12 గంలకు మీ భూమి-మీహక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం బహిరంగ సభకు హాజరు అవుతారు. గ్రామసభలో పాస్ పుస్తకాలు పంపిణీ అనంతరం పార్టీ శ్రేణులతో సీఎం సమావేశం కానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు అమరావతికి చేరుకుంటారు.