కైకలూరు బార్ అసోసియేషన్ లాయర్లను కలిసి సంఘీభావం తెలిపిన కామినేని
కైకలూరు, మేజర్ న్యూస్, శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ స్థానిక కైకలూరులో కోర్టు ఎదుట బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో న్యాయవాదుల రక్షణ చట్టము చేసి వెంటనే అమలు చేయాలి అనే నినాదంతో రిలే నిరాహార దీక్ష చేస్తున్న కైకలూరు బార్ అసోసియేషన్ లాయర్లను కలిసి సంఘీభావం తెలిపారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలనే మీ డిమాండ్ చాలా న్యాయమైనది. న్యాయవ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవడం అవసరమని ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా నేను మీ ఈ డిమాండ్‌ను, మీ ఆవేదనను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ న్యాయవాదుల రక్షణ చట్టం గురించి నేను ఖచ్చితంగా గళం విప్పుతాను. చట్టసభల్లో ఈ బిల్లు పాస్ అయ్యేలా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు, నియోజకవర్గ టిడిపి కన్వినర్ కొత్తా నాగేంద్ర కుమార్ ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ రమేష్ కైకలూరు ఏలూరు జిల్లా