BREAKING
చిన్నారుల ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో ముఖ్యం తూప్రాన్ విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట టీబీ ముక్త భారత్‌ అభియాన్‌లో జోష్ టీమ్‌ ప్రారంభం ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధికి 7 కోట్లు నిధులు వెట్టిచాకిరీ నిర్మూలనకు ‘స్వేచ్ఛా రథం’ పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం పోషణ మాసోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జ్యోతి నగర్ అంగన్వాడి కేంద్రంలో ముగిసిన 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు నీటి కోసం పాట్లు..!అర కిలోమీటర్ విద్యార్ధినుల నడక..! శనీశ్వర స్వామి వారి దర్శించుకున్న మెప్ప డైరెక్టర్ గ్రామీణ కళాకారులను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి టీబీ నిర్మూలనకు... జోష్ టీమ్ శ్రీకారం విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి సహకారం అందిస్తాం రైతు పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు

అగ్రిగోల్డ్ బాధితులు ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలి

Select Suryaa Now
అగ్రిగోల్డ్ బాధితులు ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం, ఉపశమనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా బాధితులు, డిపాజిటర్లు, ఏజెంట్ల వద్ద ఉన్న అగ్రిగోల్డ్ అసలు బాండ్లు, రసీదుల పరిశీలనకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కడియం పోలీస్ స్టేషన్ సీఐ ఏ. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమహేంద్రవరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అక్టోబర్ 9, 10 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పత్రాల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సెలవులు, ఆదివారాల్లో పరిశీలన ఉండదన్నారు.

డిపాజిటర్ స్వయంగా హాజరయ్యే వారు అసలు బాండ్ లేదా నగదు రసీదు, దాని సంతకం చేసిన రంగు జిరాక్స్, ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ, పాస్‌పోర్టు ఫొటో, మొబైల్ నంబర్ తీసుకురావాలని సూచించారు. డిపాజిటర్ మరణించిన సందర్భంలో నామినీ లేదా చట్టబద్ధ వారసులు హాజరయ్యే వారు సంబంధిత మరణ ధ్రువపత్రాలు, వారసత్వాన్ని నిర్ధారించే పత్రాలతో పాటు అవసరమైన గుర్తింపు, బ్యాంకు పత్రాలు తీసుకురావాలని తెలిపారు.

డిపాజిటర్ స్వయంగా రాలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు హాజరైతే అధికారిక అనుమతి పత్రం, కుటుంబ సంబంధాన్ని నిరూపించే పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని సీఐ వివరించారు. ఏజెంట్ల ద్వారా బాండ్లు సమర్పించే వారు ఏజెంట్ గుర్తింపు సంఖ్య లేదా కోడ్‌తో పాటు ఆధార్, పాన్, బ్యాంకు పాస్‌బుక్, ఫొటో, మొబైల్ నంబర్ అందించాలన్నారు.

అసలు బాండ్లను అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదని, కేవలం పరిశీలన కోసం మాత్రమే చూపించాలని సీఐ ఏ. వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. రంగు జిరాక్స్‌పై బాండ్ నంబర్ సహా వివరాలు స్పష్టంగా ఉండి, సంబంధిత వ్యక్తి సంతకం చేయాలని సూచించారు. పత్రాలు సమర్పించిన అనంతరం డిపాజిటర్లకు రసీదు అందజేస్తారని తెలిపారు.

సంబంధిత మండలాలకు కేటాయించిన తేదీల వివరాలను ముద్రిత, ఎలక్ట్రానిక్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలియజేస్తారని సీఐ ఏ. వెంకటేశ్వరరావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.