BREAKING
చిన్నారుల ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో ముఖ్యం తూప్రాన్ విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట టీబీ ముక్త భారత్‌ అభియాన్‌లో జోష్ టీమ్‌ ప్రారంభం ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధికి 7 కోట్లు నిధులు వెట్టిచాకిరీ నిర్మూలనకు ‘స్వేచ్ఛా రథం’ పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం పోషణ మాసోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జ్యోతి నగర్ అంగన్వాడి కేంద్రంలో ముగిసిన 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు నీటి కోసం పాట్లు..!అర కిలోమీటర్ విద్యార్ధినుల నడక..! శనీశ్వర స్వామి వారి దర్శించుకున్న మెప్ప డైరెక్టర్ గ్రామీణ కళాకారులను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి టీబీ నిర్మూలనకు... జోష్ టీమ్ శ్రీకారం విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి సహకారం అందిస్తాం రైతు పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు

బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు జీడిపల్లి కిషన్ కుటుంబాన్ని పరామర్శించిన...

Select Suryaa Now
బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు జీడిపల్లి కిషన్ కుటుంబాన్ని పరామర్శించిన...

బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు జీడిపల్లి కిషన్ కుటుంబాన్ని పరామర్శించిన…ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి...

దుబ్బాక ; బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు నగరం గ్రామ నివాసి  జీడిపల్లి కిషన్ మృతి చెందిన విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కిషన్ మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉద్యమ కాలం నుంచి పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కిషన్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పార్టీ కోసం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని, ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించిన ఒక ఆత్మీయ సహచరుడిని కోల్పోవడం బాధాకరమని అన్నారు.కిషన్ కుటుంబ సభ్యులను ఓదార్చుతూ ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. కిషన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా పార్టీ కోసం ఆయన చేసిన సేవలు ఉద్యమంలో ఆయన అందించిన సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఎమ్మెల్యే అన్నారు.
ఈ విషాద సమయంలో కిషన్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ  తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి  భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొని జీడిపల్లి కిషన్  మృతికి సంతాపం తెలిపారు.