BREAKING
ఆంగ్ల భాష పై నైపుణ్యం సాధించాలి - కలెక్టర్ దివాకర నరజాముల తాండలో వివాదాస్పద భూములపై ఆర్డివో తనిఖీ వచ్చే మార్చిలోగా జిల్లాలో రైతులందరికీ రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు -- సింగవరంలో ఎమ్మెల్యే చింతమనేని తో కలిసి పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్ వెట్రి సెల్వి కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు.. నమూనాల సేకరణ. ఫార్మర్ రిజిస్ట్రేషన్ పరిశీలించిన. జిల్లా వ్యవసాయ అధికారి. మోదీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన కాంగ్రెస్ నాయకులు... స్టేషన్ రోడ్డులో నీళ్ళు రావడం లేదు గుండాల ఆసుపత్రి సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు ? నీటిని పొదుపు చేద్దాం.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పిద్దాం సర్పంచ్ మమత వెంకట్ రెడ్డి మనిషి బ్రతికుంటే ఓటు కావాలి చనిపోతే ఆరడుగుల స్థలం దొరకని దుస్థితి అమిత్ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో దైవాలరావూరు భూములకు విముక్తి. రోడ్డుకు ఇరువైపుల గల, పిచ్చి మొక్కలు తొలగింపు. భద్రాచలం రహదారి సమస్యపై హరీష్ రావుకు వినతి. రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల కరపత్రం ఆవిష్కరణ

గుడ్డు పోషకాహారానికి చౌకైన వనరు .. ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

Select Suryaa Now
గుడ్డు పోషకాహారానికి చౌకైన వనరు .. ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
- 2,739.04 కోట్ల గుడ్ల ఉత్పత్తి.. దేశ ఉత్పత్తిలో 18.37 శాతం వాటా
- ప్రజల పోషక భద్రతకు, పౌల్ట్రీ రైతుల ఆదాయ వృద్ధికి ప్రాధాన్యం
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పౌల్ట్రీ రంగానికి ప్రోత్సాహం
- పౌల్ట్రీ డెవలప్‌మెంట్‌ పాలసీ 2026–29తో ఆధునిక యూనిట్లు, మౌలిక సదుపాయాలకు చేయూత
- స్థానిక వినియోగం, ఎగుమతుల పెంపుతో విస్తృత వ్యాపార అవకాశాలు
- ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
ఒంగోలు, మేజర్ న్యూస్:
అందరికీ సరసమైన ధరలో లభించే నాణ్యమైన పోషకాహారం గుడ్డు అని, గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అక్టోబర్‌ 9న ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఒక ప్రకటనలో ప్రజలకు గుడ్డు పోషక విలువలపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటు ధరలో నాణ్యమైన ప్రోటీన్‌ను అందించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడంలో పౌల్ట్రీ రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్‌ నెల రెండో శుక్రవారం ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని, గుడ్డు వల్ల కలిగే పోషక ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడం, సమతుల్య ఆహారంలో దాని ప్రాధాన్యతపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యమని మంత్రి వివరించారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ప్రోటీన్‌తోపాటు పలు అవసరమైన పోషకాలను పొందేందుకు గుడ్డు ఉపయోగపడుతుందన్నారు. పిల్లలు, యువత, గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, శారీరక శ్రమ చేసేవారు తమ వయస్సు, ఆరోగ్య పరిస్థితి, పోషక అవసరాలకు అనుగుణంగా సమతుల్య ఆహారంలో గుడ్డును చేర్చుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో 1,190.88 లక్షల కోళ్ల సంపదతో పౌల్ట్రీ రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారంగా కొనసాగుతోందని అచ్చెన్నాయుడు తెలిపారు. 2024–25లో ఆంధ్రప్రదేశ్‌ 2,739.04 కోట్ల గుడ్ల ఉత్పత్తిని నమోదు చేసి దేశంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయిన 14,911 కోట్ల గుడ్లలో రాష్ట్ర వాటా 18.37 శాతంగా ఉందని వివరించారు. ఈ స్థాయికి చేరుకోవడంలో పౌల్ట్రీ రైతుల కృషి ప్రశంసనీయమని, రాష్ట్ర అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పౌల్ట్రీ రంగానికి ప్రోత్సాహం అందిస్తోందన్నారు. 
 
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్వర్ణాంధ్ర–2047, వికసిత్‌ భారత్‌ లక్ష్యాలకు అనుగుణంగా పౌల్ట్రీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పెరుగుతున్న అవసరాలను తీర్చడం, స్వయం సమృద్ధిని సాధించడం, కొత్త అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ పౌల్ట్రీ డెవలప్‌మెంట్‌ పాలసీ 2026–29ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. పౌల్ట్రీ రైతులకు మౌలిక సదుపాయాలు, ఆధునిక పౌల్ట్రీ యూనిట్ల ఏర్పాటు, వడ్డీ రాయితీలు తదితర ప్రోత్సాహకాలతో ఈ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని వివరించారు. స్థానికంగా గుడ్ల వినియోగాన్ని పెంచడంతోపాటు వివిధ పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తలసరి గుడ్ల వినియోగం సంవత్సరానికి సుమారు 108 గుడ్లుగా ఉందని, జాతీయ స్థాయిలో తలసరి వార్షిక గుడ్ల లభ్యత సుమారు 104గా ఉందని మంత్రి తెలిపారు. తలసరి వార్షిక వినియోగాన్ని 180 గుడ్లుగా పరిగణిస్తే రాష్ట్రంలో సుమారు 959 కోట్ల గుడ్లకు, దేశంలో సుమారు 26,280 కోట్ల గుడ్లకు డిమాండ్‌ ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ అంచనాలు పౌల్ట్రీ రంగంలో ఉత్పత్తి విస్తరణకు, పెట్టుబడులకు, కొత్త వ్యాపార అవకాశాలకు ఉన్న సామర్థ్యాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. గుడ్ల ఉత్పత్తి పెరగడం ద్వారా పౌల్ట్రీ రైతులకు స్థిరమైన ఆదాయ అవకాశాలు లభించడంతోపాటు ప్రజలకు సరసమైన ధరలో నాణ్యమైన ప్రోటీన్‌ అందుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. అందువల్ల ఉత్పత్తి, వినియోగం రెండింటినీ ప్రోత్సహించడం రాష్ట్ర ఆహార, పోషక భద్రతలో ముఖ్యమైన అంశమని స్పష్టం చేశారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, గుడ్లు, పౌల్ట్రీ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడం, వినియోగదారులకు సురక్షితమైన ఆహారాన్ని అందించడం లక్ష్యంగా పశుసంవర్ధక శాఖ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. పౌల్ట్రీలో వ్యాధుల నియంత్రణ, బయోసెక్యూరిటీ, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు, పరిశుభ్రత, సురక్షితమైన గుడ్ల ఉత్పత్తిపై రైతులకు నిరంతరం అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పౌల్ట్రీ రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.