స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
కనిగిరి ,మేజర్ న్యూస్ :త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తెలిపారని మునిసిపల్ కమీషనర్ పీ. శ్రీధర్ తెలిపారు. గురువారం ఎన్నికలకు సంబంధించి వీడియో కాన్ఫిరెన్స్ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల అధికారి మరియు కమీషనర్ & డైరెక్టర్ అఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేటన్ హాజరయ్యారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎన్నికల అధికారులకు విధి, విధానాలు, నామినేషన్ల ప్రక్రియ, ఓటింగ్, స్ట్రాంగ్ రూమ్ భద్రత ఏర్పాటు గురించి మరియు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ ల గురించి ఇతర ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు .