రైతులకు బ్రోమో డయోలిన్ పై అవగాహన కార్యక్రమం
పొన్నూరు మండలంలోని రైతు సేవా కేంద్రాల వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సామూహిక ఎలుకల నియంత్రణ కార్యక్రమం నిర్వహించారు. మునిపల్లెలో రైతులకు ఉచితంగా బ్రోమోడయోలిన్ విష ఎరను పంపిణీ చేశారు. ఎలుకల బొరియలను గుర్తించి 10 గ్రాముల పొట్లాలను కన్నాల వద్ద ఉంచాలని అధికారులు సూచించారు. కార్యక్రమాన్ని డివిజన్ పర్యవేక్షణ అధికారి సునీత పరిశీలించారు. మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
పొన్నూరు ఎన్ డి పి సూర్య రిపోర్టర్ శిలార్