సుభాష్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు!
సుభాష్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు!
సిద్దిపేట అర్బన్ :బతుకమ్మ.. దసరా పండుగల వేళ సిద్దిపేట పట్టణంలో ట్రాఫిక్ రద్దీపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.పండుగ షాపింగ్‌కు ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో.. సుభాష్ రోడ్డులో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.పండుగలు పూర్తయ్యే వరకు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుభాష్ రోడ్డులో ఆటోలు, కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలకు అనుమతి లేదు.టూ వీలర్ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.ఇది సాధారణ సూచన కాదు.. పోలీసుల స్పష్టమైన ట్రాఫిక్ ఆంక్షలు.ఆంక్షలను ఉల్లంఘించి నాలుగు చక్రాల వాహనాలతో సుభాష్ రోడ్డులోకి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.వ్యాపారులు కూడా తమ దుకాణాల ముందు వాహనాలను నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా చూడాలి.షాపింగ్‌కు వచ్చే ప్రజలు నో-పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలపకుండా.. పోలీసులు సూచించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలను పార్క్ చేయాలి.పండుగ వేళ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రజలు, వ్యాపారులు పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ ఏసీపీ ఎం. సుమన్ కుమార్ కోరారు.పండుగ షాపింగ్‌కు వెళ్లేవారు జాగ్రత్త..సుభాష్ రోడ్డులో ఆంక్షలు అమల్లో ఉన్నాయి..నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు