శంకర్పల్లి, మోకిల పీఏసీఎస్‌లకు కొత్త పాలక మండళ్లు
సోమవారం చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం
-శంకర్పల్లి పీఏసీఎస్ నూతన చైర్మన్ బొల్లారం వెంకటరెడ్డి… మోకిల -పీఏసీఎస్ నూతన చైర్మన్ గౌండ్ర సత్యం
శంకర్‌పల్లి : శంకర్‌పల్లి మండలంలోని శంకర్‌పల్లి, మోకిల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) నూతన పాలక మండళ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు సోమవారం నిర్వహించనున్నారు. శంకర్‌పల్లి పీఏసీఎస్ చైర్మన్‌గా బొల్లారం వెంకటరెడ్డి, మోకిల పీఏసీఎస్ చైర్మన్‌గా గౌండ్ర సత్యం బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరితో పాటు ఆయా సంఘాల వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సోమవారం నిర్వహించనున్న రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంటల సాగు, వ్యవసాయంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌కు ముందుగానే పీఏసీఎస్ పాలక మండళ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాలను పూర్తి చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేసే నాయకులకు సముచిత గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తున్నామని ఈ సందర్భంగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
(శంకర్‌పల్లి, మేజర్ న్యూస్)