బాలాజీ ఆలయంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
బాలాజీ ఆలయంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
బాలాపూర్ మండలం, జల్ పల్లి సర్కిల్ పరిధి మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఐదు గంటలకు విశ్వక్సేన పూజలతో పుణ్యాహవాచనము, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కమిటీ సభ్యులు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని, స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కళ్లెం నరేష్ గౌడ్, ఈఓ మురళీకృష్ణ, ఆలయ డైరెక్టర్లు చీమల దారి చెన్నయ్య, గొండ్యాల శేఖర్, ఎలగపల్లి అనిత, కానుగల భాస్కర్, గుర్జని రాధిక, ఉండేకారి సుధీర్ కుమార్, నాయకులు లాల్ సతీష్ గౌడ్, విజయ్ గౌడ్, మామిడిపల్లి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.