BREAKING
నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు సవాళ్లను దాటి భారత్‌పైనే వాల్‌స్ట్రీట్ గురి: భారీ పెట్టుబడులు, విస్తరణకు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాల కసరత్తు!

ఫిర్యాదు పరిష్కారమైతే సరిపోదు.. ప్రజలు సంతృప్తి చెందాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్

Select Suryaa Now
ఫిర్యాదు పరిష్కారమైతే సరిపోదు..     ప్రజలు సంతృప్తి చెందాలి..జిల్లా కలెక్టర్   మహేష్ కుమార్

అమలాపురం, మేజర్ న్యూస్ ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు, ఆ పరిష్కారంపై వారు ఎంతవరకు సంతృప్తి చెందుతున్నారో తెలుసుకోవడం కూడా పాలనలో కీలకమని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) ద్వారా అందిస్తున్న సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు జిల్లాలోని అన్ని పీజీఆర్ఎస్ కేంద్రాల్లో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు

.ప్రజల నుంచి అందే అభిప్రాయాలు, సూచనల ఆధారంగా ప్రభుత్వ సేవల్లో లోపాలను గుర్తించి, అవసరమైన మార్పులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ వివరించారు. అర్జీ స్వీకరణ నుంచి సమస్య పరిష్కారం వరకు అధికారులు స్పందిస్తున్న తీరు, సేవల అందుబాటు, పరిష్కార ప్రక్రియపై ప్రజల సంతృప్తి వంటి అంశాలను తెలుసుకోవడం ద్వారా పరిపాలనను మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతోనిర్వహించవచ్చని పేర్కొన్నారు.

రేపు యథావిధిగా పీజీఆర్ఎస్ :అక్టోబర్ 12వ తేదీ సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్‌ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, మండల తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని వెల్లడించారు.ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను సమర్పించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అభిప్రాయం నమోదు చేయాలి :
పీజీఆర్ఎస్ కేంద్రాల్లో సేవలు పొందిన ప్రజలు అక్కడ ఏర్పాటు చేసిన సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను నమోదు చేయాలని కలెక్టర్ కోరారు. అధికారుల స్పందన, సేవల నాణ్యత, సమస్య పరిష్కార విధానం తదితర అంశాలపై తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని తెలిపారు.
ఫిర్యాదు పరిష్కారంతో పాటు ప్రజల సంతృప్తి, సేవల నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ పీజీఆర్ఎస్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ స్పష్టం చేశారు.