BREAKING
స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో విజయనగరం జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం ఎస్.భూర్జవలస హెచ్ఎం కెవి సత్తిబాబుకు స్వచ్ఛత అవార్డు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు

సౌర విద్యుత్ వినియోగంతో పర్యావరణ పరిరక్షణ - జిల్లా కలెక్టర్ కె.హరిత

Select Suryaa Now
సౌర విద్యుత్ వినియోగంతో పర్యావరణ పరిరక్షణ - జిల్లా కలెక్టర్ కె.హరిత
సుూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, సౌర విద్యుత్ వినియోగంతో పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముప్త్ బిజిలి యోజన క్రింద సౌర విద్యుత్ వినియోగంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్య ఘర్ ముప్త్ బిజిలి యోజన పథకం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని, ఈ పథకం ద్వారా గృహ విద్యుత్ వినియోగదారులు తమ ఇండ్ల రూఫ్ టాప్ పై సోలార్ ప్లాంటును ఏర్పాటు చేసుకోవడంతో ప్రతి నెల 360 యూనిట్ల వరకు విద్యుత్ ను పొందవచ్చని తెలిపారు. సోలార్ వినియోగం ద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించవచ్చని, అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ అవగాహన పెంచుకొని, సోలార్ విద్యుత్ వినియోగించుకునేలా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.