రుద్రారంలో విద్యార్థులకు హెల్మెట్ల పంపిణీ
-గ్రామస్తులకు రేషన్ కార్డుల పంపిణీ…
రుద్రారం గ్రామంలో సర్పంచ్ యాదిరెడ్డి ఆధ్వర్యంలో... ఎంపీపీఎస్ పాఠశాలకు చెందిన 35 మంది విద్యార్థులకు ఉచితంగా ఆటల దుస్తులు పంపిణీ చేశారు. గ్రామస్థులకు రేషన్ కార్డులు, వాహనదారులకు ఉచిత హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ... మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని, అలా చేస్తే తల్లిదండ్రులపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. యువత తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై బయటకు రావద్దని సూచించారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పిలపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మణ్నాయక్, ఎంపీడీఓ అపర్ణ, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
షాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 09)