BREAKING
నారాయణపేటలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నేటి రాశి ఫలాలు – 15 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 15 అక్టోబర్ 2026 మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన వైయస్సార్సీపీ వడ్డీ రఘురాం బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి

రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి.. మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సూచన

Select Suryaa Now
రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి.. మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సూచన

కోటపల్లి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 14): రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. కోటపల్లి మండల కేంద్రంలోని డీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో కోటపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో చైర్‌పర్సన్‌గా అనిత రమేష్ నాయక్, వైస్ చైర్‌పర్సన్‌గా మధులత శ్రీనివాస్ చారి సహా నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌తో పాటు పాలకవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. రైతుల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తూ మార్కెట్ కమిటీ అభివృద్ధికి సమష్టిగా పనిచేయాలని, రైతులకు నమ్మకమైన సేవలు అందించి కమిటీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రైతుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం ప్రతి ఒక్కరి ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ, రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.అనంతరం నియోజకవర్గంలోని 21 మంది లబ్ధిదారులకు రూ.21,02,436 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పంపిణీ చేశారు. అలాగే అర్హులైన లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.