BREAKING
రాజంపేటలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు బంగారు మైసమ్మ సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ప్రత్యేక పూజలు ట్రిపుల్ రైడింగ్‌పై పోలీసుల కొరడా.. యువతకు కౌన్సెలింగ్ దుగినేపల్లి చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనానానికి ఏర్పాట్లు అంగడి బజారుకు ప్రత్యేక స్థలం కేటాయించాలి! మండలం ప్రజల డిమాండ్ ఆనవరంలో వైసీపీకి షాక్‌.. టీడీపీలోకి 40 కుటుంబాలు! అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చప్పబుచ్చంపేట వైసీపీ ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థి ఖరారు పారిశుధ్య కార్మికులకు దసరా కానుకలు అందజేసిన కౌన్సిలర్ శాంతిరాజు నాయక్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ రద్దు... *ఎంపీడీవో బి వి జ పాత్రో పూల పండుగలో పాల్గొన్న మహిళలు.. పాటలు, ఆటలతో సందడి శ్రీ కోట దుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎన్ జి ఓ నాయుకులు నేడు ఎంపీటీసీ ఎన్నికలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల *ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణ వెల్లడి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాదారం సర్పంచ్ రాములు మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా పట్నాన సాయిశ్రీ ని ఖరారు

కోలం సంఘం నూతన అధ్యక్షుడు బొజ్జిరావుకు ఘన సన్మానం

Select Suryaa Now
కోలం సంఘం నూతన అధ్యక్షుడు బొజ్జిరావుకు ఘన సన్మానం
సూర్య తిర్యాణి : తిర్యాణి కోలం సంఘం మండల నూతన అధ్యక్షుడిగా నియమితులైన బొజ్జిరావును బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హనుమండ్ల జగదీష్ శాలువాతో ఘనంగా సన్మానించారు. నూతన బాధ్యతలు చేపట్టిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ.. సంఘ సభ్యులను సమన్వయం చేసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. కోలం సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగాలని కోరారు. బొజ్జిరావు తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
అనంతరం బొజ్జిరావు మాట్లాడుతూ.. తనను మండల అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, సభ్యుల సహకారంతో సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనను సన్మానించిన జగదీష్‌కు ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కోలం సంఘం సభ్యులు పాల్గొని బొజ్జిరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు.