BREAKING
గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం ఎస్.భూర్జవలస హెచ్ఎం కెవి సత్తిబాబుకు స్వచ్ఛత అవార్డు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు స్థానిక ఎన్నికల్లో నూరుశాతం కూటమి గెలవాలి

కాగ్నా నదిలో ఇసుక తవ్వకాలు అక్రమం.. బషీరాబాద్‌లో రైతుల తీవ్ర ఆగ్రహం, తహసీల్దార్ కార్యాలయం ముట్టడి

Select Suryaa Now
కాగ్నా నదిలో ఇసుక తవ్వకాలు అక్రమం.. బషీరాబాద్‌లో రైతుల తీవ్ర ఆగ్రహం, తహసీల్దార్ కార్యాలయం ముట్టడి

బషీరాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 01):వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవద్గి వద్ద కాగ్నా నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు స్థానిక రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నది ప్రవాహ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో ఇసుకను తరలిస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసన తెలిపారు. నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించడంతో పాటు, అధికారుల తీరుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీయడంతో స్థానికంగా ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది.
పరిమితికి మించి ఇసుకను తోడేస్తుండటంతో తమ ప్రాంతంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కోసం వేసుకున్న బోర్లు ఒక్కొక్కటిగా ఎండిపోతుండటంతో వేలాది ఎకరాల్లో సాగు చేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని వాపోయారు. అధికారుల అండదండలతోనే కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతున్నారని, దీనివల్ల భవిష్యత్తులో తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతోనే నేడు ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.ట్రాక్టర్ల అడ్డుగింపు అనంతరం ఆగ్రహం చల్లారని రైతులు, సర్పంచ్‌‌ నేతృత్వంలో నేరుగా బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ముట్టడి చేపట్టారు. కార్యాలయం ఎదుట బైఠాయించి ఇసుక రీచ్‌ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తక్షణమే స్పందించి అక్రమ ఇసుక తవ్వకాలను పూర్తిగా నిలిపివేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున రాస్తారోకోలు చేపడతామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్పందించిన రెవెన్యూ మరియు పోలీసు అధికారులు రైతులతో చర్చలు జరిపి, నిబంధనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఉద్రిక్తత కొంతమేర సద్దుమణిగింది.

రిపోర్టర్ కాశీంపాషా.