జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
చుంచుపల్లి, సూర్య(మేజర్ న్యూస్) - తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కొత్తగూడెంలో తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు డా. జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రకటించింది. ఈనెల 10 నుంచి 18 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి విద్యానగర్ కాలనీలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయం, హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ లైన్‌లో బతుకమ్మ సంబరాలు జరుగుతాయని తెలిపింది. గత ఐదేళ్లుగా నిర్వహిస్తున్న వేడుకలను ఈ ఏడాది మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
ఈ వేడుకల్లో డా. జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, జనసేన తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ హెల్త్ డైరెక్టర్ డా. గడల శ్రీనివాసరావు పాల్గొంటారని తెలిపారు.ప్రతిరోజూ ఉత్తమ బతుకమ్మకు పట్టుచీర బహుమతిగా, మరో నలుగురికి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని, బతుకమ్మ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీక అని, నియోజకవర్గ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.