BREAKING
52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి. పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం, అయినవిల్లి కార్యనిర్వహణాధికారి వారి సమక్షములో ధర్మకర్తల మండలి సమావేశం దివాన్ చెరువులో జక్కంపూడి రామ్మోహన్ రావుకు ఘన నివాళి :పేద మహిళలకు చీరల పంపిణీ తాతల నాటి కళకు.. మనవళ్ల సాంకేతికత తోడైతే.. జీఎస్టీ సమూల ప్రక్షాళన: అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు.. జీఎస్టీ సంస్కరణలకు పారిశ్రామిక వర్గాల జేజేలు.. క్యాన్సర్ మందుల ట్రేడ్ మార్జిన్లపై 30% పరిమితి: కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రకటన.. రోగులకు భారీ ఊరట!

సామాన్య భక్తులకు 8 గంటలపాటు జగన్మాత దివ్య దర్శనం

Select Suryaa Now
సామాన్య భక్తులకు 8 గంటలపాటు జగన్మాత దివ్య దర్శనం

సిఫార్సులు లేకుండా సామాన్య భక్తులకు ప్రత్యేక దర్శనం

రూ.1,000 టికెట్‌పై ఉచిత బస్సు సౌకర్యం.. ‘మన మిత్ర’ ద్వారా బుకింగ్

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 9, మేజర్ న్యూస్ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ‘జగన్మాత దివ్య దర్శన్‌’ ప్రత్యేక టికెట్లను ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ శుక్రవారం విడుదల చేశారు. అక్టోబర్ 11, 12, 13 తేదీల టికెట్లను ప్రభుత్వ ‘మన మిత్ర’ వాట్సాప్‌ నంబర్‌ 9552300009 ద్వారా భక్తులు బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. రూ.1,000 టికెట్‌పై ఎలాంటి సిఫార్సులు లేకుండా ఎనిమిది గంటలపాటు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని, కుమ్మరిపాలెం సెంటర్‌లోని టీటీడీ స్థలం నుంచి కొండపైకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ఓం టర్నింగ్‌ వద్ద ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా అమ్మవారి ముఖ మండపం (బంగారు వాకిలి) నుంచి దర్శనం కల్పిస్తామన్నారు. రూ.500, రూ.300, రూ.100 దర్శన టికెట్లను రద్దు చేసి, ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నాలుగు క్యూలైన్ల ద్వారా ఉచిత దర్శనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్‌ ప్రముఖులకు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, రాత్రి 7.45 నుంచి 9.45 గంటల వరకు మాత్రమే రూ.1,000 ప్రత్యేక దర్శనం అందుబాటులో ఉంటుందని వివరించారు. భక్తులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా వాట్సాప్‌ ద్వారా ముందస్తుగా టికెట్లు బుక్‌ చేసుకుని సౌకర్యవంతంగా అమ్మవారిని దర్శించుకోవాలని ఈవో కోరారు.

✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా