జేఎన్‌టీయూకే అంతర్ కళాశాల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ముగింపు
విజయవాడ, మేజర్ న్యూస్ : జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అంతర్ కళాశాల సెంట్రల్ జోన్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు, ఎంపిక ట్రయల్స్ విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వై.వి. రావు సిద్ధార్థ క్రీడా సముదాయంలో ముగిశాయి. ఈ పోటీల్లో 26 పురుషుల జట్లు, 14 మహిళల జట్లు పాల్గొనగా, ఎంపిక ట్రయల్స్‌లో 60 మంది క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. మహిళల విభాగంలో విజయవాడ పీఎస్‌సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రథమ, గుడ్లవల్లేరు ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ద్వితీయ స్థానాలు సాధించాయి. పురుషుల విభాగంలో పరితాల అమృత సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రథమ, గుడ్లవల్లేరు ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ద్వితీయ స్థానాలు సాధించాయి. ముగింపు కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమీ ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏవీ రత్న ప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. రవిచంద్, జేఎన్‌టీయూకే క్రీడా విభాగం అధికారులు, అధ్యాపకులు పాల్గొని విజేతలను అభినందించారు.
✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా