BREAKING
మూడు పదవుల ముచ్చటేనా.. బాధ్యతల సంగతేంటి? బొడ్డు వెంకటరమణ కు మూడు కీలక పదవు లపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన, వ్యక్తిత్వ పోటీలు తైలాభిషేకాలతో శనేశ్వరాలయం…దర్శనానికి పోటెత్తిన భక్తులుస్వా మివారికి రూ.5.16 లక్షల ఆదాయం ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఇంటికీ ఒక జూట్ సంచి పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల

ప్రజా దర్బార్‌తో సమస్యల పరిష్కారానికి భరోసా * కంకిపాడు లాక్‌ రోడ్డులో మద్యం దుకాణం ఏర్పాటుపై మహిళల అభ్యంతరం * ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్రతో మాట్లాడిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్

Select Suryaa Now
ప్రజా దర్బార్‌తో సమస్యల పరిష్కారానికి భరోసా * కంకిపాడు లాక్‌ రోడ్డులో మద్యం దుకాణం ఏర్పాటుపై మహిళల అభ్యంతరం * ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్రతో మాట్లాడిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్

పెనమలూరు, మేజర్ న్యూస్ : ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి శుక్రవారం పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా విని వినతిపత్రాలను స్వీకరించారు. పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, ముఖ్యమంత్రి సహాయ నిధి, రహదారులు, మురుగునీటి కాలువలు తదితర సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. కంకిపాడు లాక్‌ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేయనున్న మద్యం దుకాణాన్ని నిలిపివేయాలని పలువురు మహిళలు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన బోడే ప్రసాద్, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో వీడియో కాల్‌లో మాట్లాడి మహిళలతో సమస్యను వివరింపజేశారు. మద్యం దుకాణం ఏర్పాటుతో ఎదురయ్యే అనర్థాలను మహిళలు వివరించగా, దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా పలు కళాశాలల వద్ద ఆకతాయిల ఆగడాలు పెరుగుతున్నాయన్న ఫిర్యాదులపై స్పందించిన ఎమ్మెల్యే, గుర్తించిన యువకులకు కౌన్సెలింగ్‌ ఇప్పించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో డ్రైనేజీ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేసేందుకు పార్టీ కార్యాలయం ప్రతిరోజూ అందుబాటులో ఉంటుందని, ప్రతి సమస్యను బాధ్యతగా తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ భరోసా ఇచ్చారు.

✍️ప్రేమ్ రాజ్, పెనమలూరు, కృష్ణా జిల్లా