జై శ్రీ లక్ష్మీ స్టోన్ క్రషర్ క్వారీలో అధికారుల తనిఖీలు
శ్రీ జై లక్ష్మి స్టోన్ క్రషర్ క్వారీలో అధికారుల తనిఖీలు
– గడువు ముగిసిన అనుమతులతో నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై పరిశీలన
– సంయుక్తంగా తనిఖీలు చేపట్టిన విజిలెన్స్, గనులు, రెవెన్యూ అధికారులు
మండల పరిధిలోని పసుమాముల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 137/1లో నిర్వహిస్తున్న శ్రీ జై లక్ష్మి స్టోన్ క్రషర్ క్వారీలో రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా మంగళవారం నిఖీలు నిర్వహించారు.
క్వారీ నిర్వహణకు సంబంధించిన అనుమతుల గడువు ముగిసినప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. క్వారీకి సంబంధించిన అనుమతులు, నిర్వహణ పరిస్థితులను అధికారులు పరిశీలించి చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
రిపోర్టర్ : దుబ్బాక యాదయ్య
అబ్దుల్లాపూర్ మెట్, మేజర్ న్యూస్..