ఇచ్చిన మాటకు కట్టుబడి నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న సర్పంచ్ కొండ శ్రీను
ఇచ్చిన మాటకు కట్టుబడి నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న సర్పంచ్ కొండ శ్రీను
????మానవత్వం చేరుకుంటున్న దుబ్బకాల్వ సర్పంచ్
మునుగోడు,మేజర్ న్యూస్:
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి నిరుపేద కుటుంబాలకు మండలంలోని దుబ్బాకాల్వ సర్పంచ్ కొండ శ్రీనివాస్ అండగా నిలుస్తున్నారు. గ్రామానికి చెందిన మహమ్మద్ చెత్తాబి గురువారం మృతి చెందింది. మహమ్మద్ చెత్తాబి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.
మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. అనంతరం ఎన్నికలో ఇచ్చిన మాట ప్రకారం తన సహాయంగా మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు తన వంతు సహకారం అందిస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సహాయం అందించడం పట్ల గ్రామస్థులు ఆయనను అభినందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. నిరుపేద కుటుంబాలకు తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కంబాలపల్లి శంకర్,గ్రామ శాఖ అధ్యక్షుడు దండు వెంకటయ్య, వార్డు సభ్యులు షేక్ ఇబ్రహీం, మహమ్మద్ పాషా, కొండా యాదయ్య తదితరులు పాల్గొన్నారు.