BREAKING
స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్, ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* కేంద్ర సీఇసీ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలి.. రౌండ్ టేబుల్ సమావేశంలో కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ ఘనంగా విశిష్ట విద్య ప్రదాత పురస్కారం నేరాల నియంత్రణ, ప్రజలను అప్రమత్తం చేసేందుకు కార్డెన్ సెర్చ్. సి. ఐ నాగమల్లేశ్వరరావు. పొన్నూరులో రెవెన్యూ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సమీక్ష గీతంలో డా.ఎమ్.వి.వి.ఎస్ మూర్తి మూట్‌కోర్టు పోటీల ముగింపు ... విజేతగా సింబయాసిస్ న్యాయ విశ్వవిద్యాలయం రైతుబజార్ లో కమర్షియల్ షాపుల కేటాయింపునకు దరఖాస్తుల ఆహ్వానం! త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట మైన ముందస్తు ఏర్పాట్లు చేయాలి* పకడ్బందీగా ఎన్నికల నిర్వహించాలి ఆర్డీవో చిన్నయ్య నూతనకల్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు జనసేనలోకి 60 కుటుంబాల యువత చేరిక నోబుల్ అరెస్టుపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అగ్రహం -- తక్షణమే నోబుల్ ని విడుదల చేయాలని నాయకుల డిమాండ్ మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ముందస్తు సన్నద్ధతతో ఉండాలి వివేకానంద స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు రాబోయే మున్సిపల్ ఎన్నికలపై మాజీ కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శంభంగి

హిందీ భాష సాంస్కృతిని  సాంప్రదాయాన్ని కాపాడుకుందాం.

Select Suryaa Now
హిందీ భాష సాంస్కృతిని  సాంప్రదాయాన్ని కాపాడుకుందాం.
 
సూర్య ఉట్నూర్ : ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందీ విభాగం ఆధర్యంలో హిందీ దివస్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత డాక్టర్ కె కాంచన వహించారు. ముఖ్య అతిథి ప్రిన్సిపాల్, టీ ప్రతాప్ సింగ్  మాట్లాడుతూ… భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశానికి అధికారిక భాష అవసరమైంది. భారత రాజ్యాంగ సభ 1949 సెప్టెంబర్ 14న దేవనాగరి లిపిలోని హిందీని కేంద్ర ప్రభుత్వ అధికారిక భాషగా ఆమోదించింది. ఈ చారిత్రక నిర్ణయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ దివస్‌ను నిర్వహిస్తున్నారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం దేవనాగరి లిపిలోని హిందీని కేంద్ర ప్రభుత్వ అధికారిక భాషగా పేర్కొన్నారు. హిందీతో పాటు భారతదేశంలోని ఇతర భాషలకు కూడా రాజ్యాంగం గౌరవం కల్పించింది.హిందీ భారతదేశంలోని అనేక ప్రాంతాల ప్రజలను భాషాపరంగా అనుసంధానించే ముఖ్యమైన భాషగా ఉంది. హిందీ సాహిత్యం కూడా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు సామాజిక జీవనాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక భాషకు సంబంధించిన దినోత్సవం మాత్రమే కాదు. ఇది భారతదేశంలోని భాషా వైవిధ్యాన్ని గౌరవిస్తూ, హిందీ భాష అభివృద్ధి మరియు వినియోగాన్ని ప్రోత్సహించే ముఖ్యమైన రోజు. భారతదేశంలోని అన్ని భాషలను గౌరవిస్తూ హిందీ భాషను కూడా అభివృద్ధి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత, ఈ కార్యక్రమంలో హిందీ అధ్యాపకులు డాక్టర్.కే కాంచన, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి ప్రసాద్, రాణి, ముజీబ్,కళాశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు